క్రైమ్ కంట్రోల్ లో సీసీ కెమెరాలూ….పోలీసులే!

CCTV1_0_1_0_0_0_0_0_0డే బై డే క్రైమ్ రేట్ పెరిగిపోతోంది.. అంతకు మించి క్రైమ్ డిఫ్రెంట్ షేడ్స్ తీసుకుంటుంది. నేరగాళ్లు తెలివిమీరి పోయారు…ఆధారాలు లేక… చాలా కేసులు ట్రేస్ అవుట్ కావడం లేదు. దీంతో  క్రిమినల్స్ ను  పట్టుకోవడం కాప్స్ కు చాలెంజింగ్ మారింది. ఈ  టైంలో.. లా అండ్ ఆర్డర్ మెయిన్ టెనెన్స్ లో  సీసీ కెమేరాలు కీ రోల్ పోషిస్తున్నాయి. ఇన్సిడెంట్ ఏదైనా.. ఎవిడెన్స్ సీసీ ఫుటేజే అవుతోంది. జంట కమిషనరేట్ పరిధిలో సీసీ కెమేరాల ఇంపార్టెన్స్ పెరిగిపోయింది.  సీసీ ఫుటేజీతోనే చాలా కేసులు ట్రేసవుట్ అవుతున్నాయి. సీసీ కెమేరాలకు చిక్కిన ఆధారాలతోనే చాలా కేసులు సాల్వ్ అవుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ నుంచి.. చోరీ కేసులు.. మర్డర్ మిస్టరీల చేధనకు ..సీసీ కెమెరాలే.. కీ రోల్ పోషిస్తున్నాయి. రీసెంట్ ఇన్సిడెంట్స్ చూస్తే… SR నగర్ లో ఓ మహిళపై కాల్పులు జరిపి.. ఏటీఎంలో చోరీ చేసిన ఘటన సిటీలో సంచలనం రేపింది. ఈ ఇన్సిడెంట్ లో సీసీ కెమెరా ఫుటేజీ అధారంగానే నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. అలాగే హుమాయన్ నగర్ లో నాలుగు కేజీల బంగారం దారిదోపిడి కేసులో నిందితులను పట్టుకోవడంలో సీసీ పుటేజే హెల్ప్ అయింది.

సీసీ కెమేరాల ఏర్పాటుతో సిటీలో చాలావరకు నేరాలు అదుపులోకొచ్చాయి. సీసీ కెమెరాల కంట్లో పడతామన్న భయంతో.. నేరం చేయడానికి క్రిమినల్స్ కూడా జంకుతున్నారు.  దీంతో  సీటీ మొత్తం సీసీ కెమరాల నిఘా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. నగరంలో లక్ష కెమేరాలను ఏర్పాటుచేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫుటేజీ క్లారిటీ కోసం.. పవర్ పుల్ సీసీ కెమెరాలను ఫిక్స్ చేయాలని డిసైడయ్యారు. రాత్రి విజువల్స్ కూడా క్లారిటీగా కనిపించే హై డెఫినేషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉన్నారు. కేసులు సాల్వ్ చేయడంలో  సీసీ కెమెరాలు ప్రధాన ఆధారం అవుతుండటంతో కిరాణం షాపు దగ్గర నుంచి షాపింగ్ మాల్స్ వరకు ప్రతి చోట కెమెరాలు కంపల్సరీ అని ఆర్డర్స్ పాస్ చేశారు పోలీసులు. అటు కాలనీల్లోనూ మస్ట్ గా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పబ్లిక్ సపోర్ట్ తో.. నేరాల అదుపునకు..సీసీ కెమెరా నిఘా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy