క్రైమ్ సేఫ్ సిటీగా హైదరాబాద్

hyd-runహైదరాబాద్ లో జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసి క్రైమ్ సేఫ్ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దాలని పోలీసుల 5కే రన్ నిర్వహించారు. చార్మినార్ నుండి బార్కస్ వరకు సాగిన ఈ రన్‌లో దాదాపు 10వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రన్‌లో విద్యార్థులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని, పీవీ సింధు, సీపీ మహేందర్ రెడ్డి, సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణలు ఈ రన్‌ని ప్రారంభించారు. నేరాలు జరగకుండా చూడటంలో ప్రతి ఒక్కరు సహకరించాలని పోలీసులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy