క్లబ్బు స్థలాల కొంప మునిగినట్టే!

Bridge cards picసిటీలో సుమారు 2 లక్షల మందికి పైగా కటిక పేదలున్నారు. ఫుట్ పాత్ లు, రైల్వే స్టేషన్లు, బస్ షెల్టర్లు, స్మశాన వాటికలు, పార్కులు లాంటివే వీళ్లకు నివాస ప్రాంతాలు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో సిటీలో పేదలుండకూడదన్నది కేసీఆర్ సర్కారు మోటో. అందుకే పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు… స్థలాల వేట మొదలుపెట్టింది. అందులో భాగంగా సర్కారు కన్ను రిక్రియేషన్ క్లబ్బులపై పడింది.

హార్స్ రైడింగ్ కోర్టులు, పేకాట క్లబ్బులను టార్గెట్ చేసింది సర్కారు. గత ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని నడిపిస్తున్న ఇలాంటి స్థలాలు సిటీలో… ఔట్ స్కర్ట్స్ లో వేల ఎకరాలున్నాయని అంచనా. వాటి అనుమతులు రద్దుచేసి.. వాటి స్థానంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది సర్కారు భావిస్తోంది. ఇప్పటికే  రెండువేల ఎకరాలు జాగా కనిపెట్టామన్నారు సీఎం కేసిఆర్. రేస్ కోర్టులను, పత్తాల క్లబ్బులను ఎత్తి అవతలపడేస్తామన్నారు.

పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామన్న సర్కారును  స్థలాల కొరత వెంటాడుతోంది. అందుకే జూదానికి బానిసైనవాళ్లను… ఆ మత్తులో బెట్టింగ్ లు కట్టేవాళ్లను కంట్రోల్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వాలు రేస్ గుర్రాల ఆటలకు, పత్తాలాడుకునేందుకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చాయి. జూదం మాయలో పడ్డవాళ్ల డబ్బులను ఇవి ఊడ్చేసుకుపోతున్నాయ్. దీంతో వీటిపై సర్కార్ సీరియస్ గా కాన్సంట్రేట్ చేసింది. రేస్ కోర్సులు, పేకాట క్లబ్ ల  స్థలాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు నిర్మిస్తామంటోంది.

జూదం అడ్డాలు… జంటనగరాల్లో ఎన్నున్నాయి ? రేస్ గుర్రాల కోర్టులు ఎన్నున్నాయి ? గత ప్రభుత్వాలు ఎన్నివేల ఎకరాలు వీటికి ధారాదత్తం చేశాయి ? లాంటి వివరాలు సేకరించే పనిలో పడింది సర్కార్. జూదాల అడ్డాలు కన్పించకూడదని ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం. వీటికి సంబంధించిన స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు సర్కార్ ప్రణాళికలు సిద్దంచేసింది. ఇందుకోసం  రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారని సమాచారం. గత ప్రభుత్వాలు వీటికి భూములు ఎలా కేటాయించాయి ? వాటిని స్వాధీనం చేసుకోవడానికి ఉన్న అడ్డంకులేంటన్న విషయాలపై న్యాయ నిపుణుల సహకారం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

మలక్ పేట్ పరిసరప్రాంతాల్లో గుర్రాల రేస్ క్లబ్ ఉంది.  ముషీరాబాద్, రాణిగంజ్, మొజాంజాహీ మార్కెట్, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో గుర్రపు రేస్ పై బెట్టింగ్ లు కట్టే బిల్డింగ్ లు ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మొయినాబాద్, సికింద్రాబాద్ పరిసరప్రాంతాల్లో గుర్రాలకు ట్రైనింగ్  ఇచ్చే సెంటర్లు ఉన్నట్లు సమాచారం. వీటితోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చిన్నా చితక రేస్ క్లబ్ ల ఆధీనంలో వందలాది ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఓయూ భూముల వ్యవహారంతో వ్యతిరేకత రావడంతో  … దాన్నుంచి బయటపడేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy