క్లిక్ కొట్టు.. డబ్బులు పట్టు : ఇక మీరే ట్రాఫిక్ పోలీస్

traffic-rules-hydహైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న పథకం తీసుకొచ్చారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ, నిబంధనల ఉల్లంఘనపై సరికొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు పోలీసులు మాత్రమే ఫొటోలు తీసి.. చలానాలు రాసేశారు. పాయింట్లు వేసి భయపెట్టేవారు. ఇక నుంచి ఆ అవకాశాన్ని జనానికి కూడా కల్పించారు. ఎవరైనా సరే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తుంటే ఫొటో తీసి పంపిస్తే చాలు వెంటనే వాళ్లకు చలానా వస్తోంది. అంతేనా మీ ఫోన్ నెంబర్ కు కూడా పాయింట్లు యాడ్ అవుతాయి. పాయింట్లు పెరిగే కొద్దీ.. మీ ఖాతా డబ్బులు కూడా పడతాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకొస్తున్న ఈ కొత్త స్కీమ్ వాహనదారుల్లో కలకలం రేపుతోంది.

మీ ఫొటో, వీడియోకి పాయింట్లు ఎలా.. డబ్బులు ఎలా వస్తాయి అంటే :

రోడ్లపై ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారో వాటికి సంబంధించి మీరు ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. వాటిని ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలోని వాట్సాప్ నంబర్ పంపిస్తారు. మీ పంపిన సమాచారం పక్కాగా ఉంటే వెంటనే ఆయా వాహనదారులకు వెంటనే చలాన్లు వెళ్లిపోతాయి. మీరు చేసిన సేవకు గాను.. మీ ఫోన్ నెంబర్ కు పాయింట్లు యాడ్ చేస్తారు. అలా 100 పాయింట్లు అవ్వగానే 100 రూపాయలు మీరు చెప్పిన అకౌంట్ వేస్తారు. సో.. ఇక ట్రాఫిక్ పోలీస్ మాత్రమే ఫొటో తీస్తాడని భయపడే వారు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటారు. నీ ముందు, వెనక ఉండే ఏ వాహనదారుడు అయినా సరే మీ వాహనంపై నిఘా పెట్టొచ్చు. సో.. బీ కేర్ ఫుల్ రైడర్స్.

సిటిజన్స్ రిపోర్ట్ చేసే వాటికి పాయింట్లు ఇలా ఉన్నాయి. రాంగ్ రూట్ వెహికల్ నడిపిన ఫొటో, వీడియోకి 10 పాయింట్లు, ఫుట్ ఫాత్, జీబ్రా క్రాసింగ్ లపై వెహికల్స్ నిలపడంపై 3 పాయింట్లు, ట్రిపుల్ రైడింగ్ కు 10 పాయింట్లు, నంబర్ ప్లేట్ సరిగా లేకపోతే 3 పాయింట్లు, సీట్ బెల్ట్ లేకుండా ఉంటే 7 పాయింట్లు, హెల్మెట్ లేకపోతే 7 పాయింట్లు, బ్లాక్ గ్లాస్ ఉంటే 3 పాయింట్లు, సిగ్నల్ జంపింగ్ 10 పాయింట్లు, ర్యాష్ డ్రైవింగ్ 10 పాయింట్లు, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ పై 10 పాయింట్ల చొప్పున పబ్లిక్ నుంచి వచ్చే ఫొటోలు, వీడియోలకు పాయింట్లు యాడ్ చేస్తారు.

ఇప్పటికే ఇలాంటి స్కీమ్ గోవాలో విజయవంతంగా అమలు అవుతుంది. అక్కడ లక్కీ డ్రా ద్వారా టూ వీలర్స్ ను బహుమతిగా ఇస్తున్నారు. హైదరాబాద్ లో మాత్రం ఒక్కో పాయింట్ కు ఒక్కో రూపాయి ఇవ్వనున్నారు. సో.. హైదరాబాద్ వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికితోడు మన ముందూ వెనకా కూడా చూసుకోవాలి. ఎవరైనా… ఎక్కడైనా సరే మీ వాహనాన్ని ఫొటో, వీడియో తీసే అవకాశం ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy