క్లిక్ కొట్టు : సమస్య చూపిస్తే 24గంటల్లో పరిష్కారం

hmwssbఎక్కడో ఒక చోట డ్రైనేజీ పొంగుతుంటుంది.. మ్యాన్‌హోళ్ల నుంచి మురుగు నీరు వస్తుంటుంది…..తాగునీరు కలుషితమవుతుంటుంది.. ఇలాంటి సమస్యలు నగరంలో రోజూ చూస్తూ ఉంటాం. కానీ మనకేమి పట్టనట్లు పోతుంటాం..అతి కొద్టి మందే స్పందిస్తారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు సమస్యకు స్పందించి సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి తెస్తే తక్షణమే పరిష్కరిస్తామంటున్నారు జలమండలి ఎండీ దానకిషోర్.

ఎక్కడ మురుగు, తాగునీటి సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించేందుకు జలమండలి సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తోంది. అందులో వచ్చే ఫిర్యాదులకు 24 గంటల్లో స్పందిస్తూ పరిష్కరిస్తోంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌తో పాటు కస్టమర్‌కేర్‌, డయల్‌ యువర్‌ ఎండీ, మీట్‌ యువర్‌ ఎండీ ద్వారా నేరుగా జలమండలికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో రోజూ 9.65 లక్షల కనెక్షన్లకు జలమండలి నీటిని సరఫరా చేస్తుంటుంది. దాదాపు 2.7 లక్షల మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. ప్రతిరోజు 420 మిలియన్‌ గ్యాలన్ల నీటిని పంపిణీ చేస్తోంది జలమండలి. తాగునీటితోపాటు మురుగు, బిల్లులు ఇతరత్రా సమస్యలపై నెలకు నాలుగు వేల మంది జలమండలికి ఫిర్యాదు చేస్తుంటారు. ఇందులో ఎక్కువ వ్యక్తిగత సమస్యలే. ఇంత పెద్ద నగరంలో ఎక్కడో ఒకచోట రోడ్డుపై మ్యాన్‌హోళ్లు పొంగుతుంటాయి. మంచి నీటి పైపులకు లీకేజీలు అవుతుంటాయి. ఇలాంటి వాటిపై సోషల్‌ మీడియా ద్వారా పౌరులు తమకు తెలపవచ్చంటున్నారు అధికారులు. వర్షాకాలంలో ఎక్కడ మ్యాన్‌హోల్‌ పొంగినా, పైప్‌లైన్‌ లీకయినా సరే ఒక ఫోటో తీసి….ఎక్కడ ఆ పరిస్థితి ఉందో రెండు వాక్యాలు రాసి జలమండలికి వాట్సాప్‌ ద్వారా పంపితే చాలు. ప్రత్యేకంగా జలమండలి వాట్సాప్‌ నెంబరు(99499 30003) కేటాయించింది. అలాగే కాలుష్య, మురుగు నీటి సమస్యలు, బిల్లుల సమస్యలు, కొత్త నీటి కనెక్షన్లు, ట్యాంకర్ల కోసం సంప్రదించేందుకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబరు 155313 కేటాయించింది జలమండలి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy