క్వార్టర్స్ లో గ్రేట్ విక్టరీ : సెమీస్ లోకి సింధు

DIE-_9TWsAANFxkప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రెండుసార్లు కాంస్య పతకాలు సాధించిన తెలుగమ్మాయి పీవీ సింధు మరో పతకం తన ఖాతాలో వేసుకుంది. శుక్రవావరం(ఆగస్టు-25) గ్లాస్గోలో జరిగిన క్వార్టర్స్ లో అద్భుత విజయం సాధించిన సింధు సెమీస్ లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో చైనా షట్లర్ సన్ యూపై ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 21-14-,21-9 తేడాతో ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగింది సింధు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఆమెకు ఇది మూడో పతకం. ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ షట్లర్ కూడా సింధు కావడం విశేషం. వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో సింధు ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy