క్వార్టర్ ఫైనల్లో తెలుగు తేజాలు

PV,SAINA,KIDAMBIప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజాలు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ కూడా రెండోసీడ్‌కు షాకిస్తూ క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్‌లో యువ సంచలనం సాయి ప్రణీత్‌, అజయ్‌ జయరామ్‌ ప్రీ క్వార్టర్స్‌లోనే ఔట్ అయ్యారు. గురువారం (ఆగస్టు 24) గ్లాస్గో లో జరిగిన ఉమెన్స్ సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌ పోరులో రెండుసార్లు కాంస్య పతక విజేత, నాలుగో సీడ్‌ సింధు 19-21, 23-21, 21-17తో చెయుంగ్‌ ఎన్‌గాన్‌ యి (హాంకాంగ్‌)పై అతి కష్టమ్మీద గెలుపొందింది. తొలి గేమ్‌ కోల్పోయి రెండో గేమ్‌లో నూ 13-16తో వెనకబడిన దశ నుంచి అద్భుతంగా పోరాడిన సింధు ఉత్కంఠ విజయం సాధించింది.

మరో వైపు 12వ సీడ్‌ సైనా నెహ్వాల్‌ అలవోక విజయంతో క్వార్టర్స్‌కు చేరింది. 21-19, 21-5తో తనకన్నా మెరుగైన ర్యాంకర్‌ సంగ్‌ జి హ్యున్‌ (కొరియా)పై వరుస గేముల్లో గెలుపొందింది. పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ 21-14, 21-18తో ఆండ్రెస్‌ ఆంటోన్‌సెన్‌ (డెన్మార్క్‌)పై అలవోక విజయంతో క్వార్టర్స్‌లోకి దూస్కెళ్లాడు.

13వ సీడ్‌ అజయ్‌ జయరామ్, 15వ సీడ్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు. అజయ్‌ 11–21, 10–21తో ఐదో సీడ్‌ చెన్‌ లాంగ్‌ చేతిలో ఓడిపోగా… సాయిప్రణీత్‌ 21–19, 10–21, 12–21తో ఆరో సీడ్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో తలపడి పరాజయం పొందాడు.

బ్యాడ్మింటన్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఒలింపిక్‌ రజత పతక విజేత పీవీ సింధు ఒక స్థానం మెరుగుపరచుకోగా.. ఏస్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ రెండు ర్యాంక్‌లు దిగజారాడు. గురువారం (ఆగస్టు 24) విడుదల చేసిన తాజా జాబితాలో సింధు 4వ స్థానం దక్కించుకోగా.. శ్రీకాంత్‌ 10వ ర్యాంక్‌కు పడిపోయాడు. మహిళల డబుల్స్‌ జంట అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి ఒక స్థానం ఎగబాకి 24వ ర్యాంక్‌లో నిలిచింది. సైనా నెహ్వాల్‌ 16వ ర్యాంక్‌, సాయి ప్రణీత్‌ 19వ స్థానం, ప్రణయ్‌ 15వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy