క్షమించండి..తమిళనాడుకు నీరు ఇవ్వలేం: కర్ణాటక

cauveryకావేరీ జలాల విషయంలో తమిళనాడుకు ప్రస్తుతం ఇస్తున్న దానికంటే 4 TMCల కావేరి జలాలను అదనంగా ఇవ్వాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలపై కర్ణాటక స్పందించింది. తమిళనాడుకు అదనంగా 4 TMCల నీరు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం లేదని తెలిపింది. మా దగ్గర అంత నీటి నిల్వ లేదని…తమిళనాడుకు నీరు ఇవ్వలేమని..అందుకే క్షమించండి అంటూ కర్ణాటక నీటి వనరుల శాఖ మంత్రి ఎంబీ పాటిల్  తలిపారు.

ప్రస్తుతం కావేరీ బేసిన్‌లోకి 4 కాల్వల నుంచి మొత్తం 9 TMCల నీరు వస్తోందని… ఆ నీరు మాకు తాగడానికి, పొలాలకు సరిపోవడంలేదన్నారు. మాకు నీటి కొరత ఉంది…. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం ఆదేశాలను పాటించలేకపోతున్నామన్నారు. ఈ విషయం గురించి సుప్రీంకు వివరణ ఇస్తామన్నారు మంత్రి ఎంబీ పాటిల్‌. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీం కోర్టు మే 8కి వాయిదా వేసింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy