ఖగోళ అద్భుతం : గంటన్నర సూర్యుడు మాయం.. చుక్కలు కనిపిస్తాయ్

solar eఖగోళ అద్బుతం. ఎప్పుడూ వింతే. ఆసక్తికరమే. విశ్వంలో జరిగే మార్పులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి అరుదైన అద్భుతం 2017, ఆగస్టు21న జరగబోతుందని నాసా ప్రకటించింది. 99 సంవత్సరాల తర్వాత ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతుందని తెలిపింది నాసా. అమెరికా ఖండంలోని 14 రాష్ట్రాల్లో ఈ సూర్య గ్రహణం ఏర్పడనుంది.

2017 ఆగస్టు 21న వచ్చే సూర్యగ్రహనం అరుదైనదని.. ఖగోళ అద్భుతంగా అభివర్ణించింది నాసా. మనిషి జీవితంలో ఒకసారి మాత్రమే లభించే అవకాశమని, 99 సంవత్సరాల్లో ఇది మొదటిదని చెప్పింది. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో, సూర్యుడు, భూమికి మధ్య నుంచి చంద్రుడు దాటుతూ ఒకవైపు సూర్యుడు మొత్తం కప్పి వేయడంతో  ఆకాశంలో కనిపించడని  పేర్కొంది నాసా. గంటన్నర పాటు ఈ సూర్యగ్రహణం ఉంటుందట.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఖగోళ అద్భుతాన్ని 300 మిలియన్ల కన్నా ఎక్కువ మంది వీక్షించనున్నట్లు  అంచనా వేసింది నాసా. ఈ గ్రహణాన్ని వీక్షించాలనుకునేవారు సరైన భద్రత ప్రమాణాలను పాటించాలి. ముఖ్యంగా ఎక్లిప్‌  గ్లాసెస్ లేదా హ్యాండ్‌ హెల్డ్‌ సోలార్ వ్యూయర్ వంటి సౌర ఫిల్టర్లను మాత్రమే వాడాలని సూచించింది.

ఈ గ్రహణం కారణంగా  ఆగస్టు 21న అమెరికా అంతటా మిట్ట మధ్యాహ్నం  సూర్యుడు మాయం కానున్నాడు. గ్రేట్ అమెరికన్ సోలార్ ఎక్లిప్స్  అని పిలిచే ఈ గ్రహణం పోర్ట్‌లాండ్‌ నుంచి ఓరెగాన్‌ మీదుగా, దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్‌ దగ్గర సూర్యుడు మాయమయ్యి చీకటి ఆవరిస్తుంది. రెండు నిమిషాలపాటు ఆకాశంలో చుక్కలు  కూడా కనిపిస్తాయట. 99 సంవత్సరాల క్రితం, 1918, జూన్‌ 8వ తేదీన వాషింగ్టన్‌ నుంచి ఫ్లోరిడా వరకు సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. ఆ తరువాత 2017, ఆగస్ట్ 21న రాబోతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy