ఖమ్మం బస్టాండ్ లో పోలీసుల హల్ చల్

Khammamఖమ్మం బస్టాండ్ లో ఇద్దరు ఎస్సైలు హల్ చల్ చేశారు.  కొత్తగూడెం జిల్లా ఎస్సై మహేష్, మహబూబాద్ జిల్లాకి చెందిన ఎస్సై రాణా ప్రతాప్ లు  ఓ షాపు యజమాని మీద దాడి చేశారు. రివాల్వార్ తో బెదిరించారు. షాపు యజమాని జావిద్ మీద దాడి చేసిన విజువల్స్ సీసీ కెమెరాల రికార్డ్ అయ్యాయి. బాధితుడు ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్ట్రేషన్లో ఫిర్యాదు చేయడంతో … ఎస్సై లు మహేష్,  రాణా ప్రతాప్ పై సెక్షన్ 448, 323, 506 కింద కేసు నమోదు చేశారు.  ఇద్దరు  ఎస్సై లు సొంత అన్నదమ్ములు కావడం విశేషం. ఈ దాడిని నిరసిస్తూ వ్యాపారులు ధర్నా చేశారు. ఎస్సైలు మహేష్, రాణా ప్రతాప్ పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి, చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy