ఖరారైన టీచర్ల బదిలీల షెడ్యూల్

TEACHERఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం(జూన్-1) భేటీ అయ్యారు. టీచర్ల బదిలీలు ఈ నెలలోనే నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 4, 5వ తేదీల్లో టీచర్ల ఖాళీల ప్రకటన ఉంటుంది. 6న ఖాళీల తుది జాబితా, మార్గ దర్శకాలు విడుదల చేస్తారు. 7 నుంచి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. 11, 12 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టనున్నారు. మొత్తంగా ఈ నెల 20 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు. కోర్టు కేసు తేలిన తర్వాతే ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఆగస్టులో అంతర్ జిల్లా, పరస్పర అంగీకార బదిలీలు చేపట్టాలని తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy