ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజ

govrnerరాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చవితి పందిళ్లలో గణనాథులు కోలువు దీరారు. ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేషుడి మండపానికి గవర్నర్ నరసింహన్ దంపతులు  చేరుకున్నారు. శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి రూపంలో కొలువు దీరిన వినాయకుడికి గవర్నర్ దంపతులు తొలి పూజ నిర్వహించారు. గవర్నర్ దంపతులను ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కష్టాల్లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించాలని గణేషుడిని ప్రార్థించానని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా కొనసాగాలని, అన్ని పథకాల ప్రయోజనాలు ప్రజలకు అందాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

ఖైరతాబాద్ వినాయకుడి పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పోరేటర్ విజయారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్‌తోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పదకొండు రోజుల పాటు పూజా కార్యక్రమాలు కొసాగుతాయి. సెప్టెంబర్ 5వ తేదీన నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy