ఖైరతాబాద్ మహాగణపతి

kairtabadదేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది.నవరాత్రులు కొలువుదీరేందుకు గణనాథులు సిద్ధమయ్యారు. వివిధ రూపాల్లో ఏకదంతుడు భక్తులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులను అనుగ్రహించేందుకు ఖైరతాబాద్ మహాగణపతి సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాడు. ఈ ఏడాది 57 అడుగుల ఎత్తులో కొలువుదీరిన పార్వతీ తనయుడు..శ్రీ చండీకుమార అనంత మహాగణపతి రూపంలో దర్శనమిస్తున్నాడు. లంబోదరుడికి శుక్రవారం (ఆగస్టు25) ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గననాథుడిని కనులారా తిలకించేందుకు గురువారం (ఆగస్టు24) రాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం ఏర్పడింది.

విగ్రహాల కొనుగోళ్లు, తరలింపుతో నగరవ్యాప్తంగా సందడి కనిపించింది. ప్రభుత్వ ప్రచారం ఫలించి మట్టి గణపతి విగ్రహాలకే ఈ ఏడాది నగరవాసులు  ఆసక్తి చూపించారు.

ఖైరాతాబాద్ శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి రూపం పురాణ చరిత్రకు తార్కాణంగా నిలుస్తోంది. 57 అడుగుల మహాగణపతి విగ్రహం వెనుక వైపు మేరు పర్వతంపై కల్పవృక్షం, 14 తలల ఆదిశేషుడి నీడల్లో, డాలు, శంఖు, చక్ర, గదాధారిగా ఎనిమిది చేతులతో, నిండైన విగ్రహం సాక్షాత్కరిస్తుంది. కుడివైపున సింహవాహనంపై చండీ మాత, ఎడమవైపు నెమలివాహనంపై కుమారస్వామి, కుడి వైపు మరోచోట ఆత్మలింగ సహితుడై, ధ్యానముద్రలో మహాకాళ శివుడు, ఎడమ వైపు మరోచోట మహిషాసుర మర్ధిని దుర్గమ్మవారు కొలువుదీరారు. అలాగే ప్రకృతి రమణీయతకు చిహ్నంగా విగ్రహం పైభాగాన మేరు పర్వతంపై పచ్చని కల్పవృక్షం, ఆక్కడ పక్షులు సేదతీరటం కనిపిస్తుంది. లోకంలో అనావృష్టి తొలగిపోయి పొలాలు సమృద్ధిగా పండి, సఖల శుభాలు కలిగేందుకు చండీ యాగాన్ని శాస్ర్తోక్త రీతిని నిర్వహిస్తారు. ప్రస్తుత చండీ కుమార అనంత మహాగణపతిని దర్శించుకుంటే అదే ఫలితం దక్కుతుందని అంటున్నారు.

అనంత మహాగణపతి చుట్టు కొలతలు…

మేరు పర్వతం, 14 తలల ఆదిశేషుడుతో కలిపి 57 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో మహాగణపతిని నిర్మించారు. తలభాగం 15 అడుగులు, తొండము 18అడుగులు , కాళ్లు 20 అడుగులు, ఆదిశేషుడు 20 అడుగులు, మేరు పర్వతం 30 అడుగులతో నిర్మించారు. ఈ మహాకాయుడి రూపాన్ని మలిచేందుకు 25 టన్నుల స్టీలు, 34 టన్నుల పీఓపీ, 60 బండిల్స్ జనపనారా, 600 బస్తాల బంకమట్టి, 20వేల మీటర్ల గోనెసంచులను వినియోగిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడికి 300 లీటర్ల 15 రకాల సహజ రంగులను ఉపయోగించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy