ఖైరతాబాద్ సర్కిల్‌ లో టిఫిన్ బాక్స్ కలకలం

KHAIRATABADహైదరాబాద్ లోని ఖైరతాబాద్ సర్కిల్‌ లో ఆదివారం (మే-6) మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ కలకలం సృష్టిస్తుంది. సర్కిల్ మధ్యలో ఉన్న టిఫిన్ బాక్స్‌ ను చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న బాంబు, డాగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి.  బాంబుస్క్వాడ్‌, డాగ్ ‌స్కాడ్‌ బృందాలు రంగంలోకి దిగి ఆ టిఫిన్‌ బాక్స్‌లో ఏమీ లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఖైరతాబాద్‌ సర్కిల్‌ లో ఆనందనగర్‌ కాలనీలోకి వెళ్లే మార్గంలో ఏపీ16EG 0786 నంబరు కలిగిన తెలుపు రంగు BMW కారు, దాని పక్కనే టిఫిన్‌ బాక్స్‌ ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.

టిఫిక్‌బాక్స్‌ ను తనిఖీ చేసి అందులో పేలుడు పదార్థాలు ఏమీ లేవని తేల్చారు. బాక్స్‌ తెరచి చూడగా అందులో అన్నం ఉంది. కారు యజమానిని పిలిపించి విచారించగా తాను గ్యాస్‌ కట్టర్‌ కోసం వెళ్లినట్లు చెప్పాడు. టిఫిన్‌ బాక్స్‌ అలా నిర్లక్ష్యంగా బయట ఎందుకు వదిలేసి వెళ్లారని ప్రశ్నిస్తూ అతడిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ కు తరలించారు. కారును క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు అతని వద్ద ఉన్న ల్యాప్‌ట్యాప్‌ పరిశీలించారు. అనుమానించదగ్గ ఆధారాలు ఏమీ లేవని నిర్ధారించుకుని అతడిని వదిలిపెట్టినట్లు తెలిపారు పంజాగుట్ట పోలీసులు. టిపిన్ బాక్స్ కలకలంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలిపారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy