గంటలో 75 మందికి గుండు

81442647736_625x300గిన్నీస్ బుక్ లో బ్రిటన్ బార్బర్

క్యాన్సర్ తో చనిపోయిన తన కస్టమర్ కు నివాళిగా  ఓ బార్బర్ తలపెట్టిన పని… అతనికి గిన్నిస్ రికార్డును తెచ్చిపెట్టింది. ఈ ఇన్సిడెంట్  బ్రిటన్ లో జరిగింది. రెగ్యూలర్ గా స్యామ్ రాన్ అనే బార్బర్ సెలూన్ కు ఎల్లిస్ వచ్చేది. అయితే ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ సోకింది. దీంతో కీమోథెరఫీ చేయించుకోవల్సివచ్చింది.  ఈ కారణంగా జట్టు ఊడిపోయిన ఎల్లిస్…తర్వాత పూర్తిగా సెలూన్ కు రావడం మానేసింది. హెల్త్ పూర్తిగా దెబ్బతినడంతో ఎల్లిస్ కొద్ది రోజులకే చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్యామ్ రాన్ తన కస్టమర్ ఎల్లిస్ కు నివాళిగా గుండు చేస్తానని..కావాల్సిన వారు రావాలని ప్రచారం చేశాడు. 48 సెకన్లలో ఒక్కొక్కరికి గుండు గీస్తూ… గంటలో 75 గుండ్లు పూర్తి చేశాడు. వారిచ్చిన డబ్బును ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందించాడు. విషయం తెలుసుకున్న గిన్నిస్ రికార్డు అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో గంటలో అత్యధిక మందికి గుండు గీసిన వ్యక్తిగా రాన్ నిలిచాడు.

 

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy