గజల్ కింగ్ జగ్ జీత్ సింగ్ జయంతి

జగ్జీత్ సింగ్ ….గజల్ పాటలకు తోటమాలి.  ఇవాళ  జగ్జీత్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ప్రేమతో ఆయన పెంచుకున్న  పాటల  పూదోట అలాగే ఉంది.  గజల్ గాన ప్రపంచంలో  జగ్జీత్ సింగ్ అచ్చమైన భారతీయ ముద్ర .  జగ్జీత్ సింగ్ …..ఈ పేరు వినగానే  ఎవరికైనా  మనసుకు హాయినిచ్చే గజల్స్  గుర్తుకు వస్తాయి.  ఒక సుస్వర గజల్  ప్రపంచం మన కళ్ల ముందు  సాక్షాత్కరిస్తుంది. గజల్ ప్రపంచంలో సహజంగా గులాం అలీ, మెహదీ హసన్ లాంటి పాకిస్తానీ సింగర్లదే  పై చేయి. గజల్స్  ఆలపించాలంటే  ఎవరైనా తమ తరువాతే అనుకుంటారు.  అయితే,  ఈ ఆధిపత్యాన్ని దెబ్బతీశాడు జగ్జీత్ సింగ్. గజల్  చరిత్ర ను తిరగరాశాడు. జగ్జీత్ సింగ్  పంజాబీ.  బతుకుదెరువు వెతుక్కుంటూ  అరవైల్లో  ముంబై వచ్చాడు.  చిత్రా సింగ్ సాహచర్యంలో  ఎన్నో అద్బుత  గజల్స్  ఆలపించాడు. భారత ఉప ఖండంలో జగ్జీత్  గజల్ ఆల్బమ్ లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతాయి. వీటికున్నంత డిమాండ్ మరే గాయకుడి గజల్స్ కు  లేదు.  గజల్  పాటలను, సాధారణ ప్రజల  ముంగిటకు ఒక వెండి వెన్నెల లా కురిపించిన ఘనత నిస్సందేహంగా  జగ్జీత్ దే. జగజ్జీత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన పాటల పూదోట మీకోసం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy