గట్టి ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో కేజ్రీవాల్?

aaకేంద్ర ప్రభుత్వం పై ధర్నా యుద్ధం, లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటన తర్వాత కేజ్రీవాల్ దేశం మొత్తం కన్నా తన దృష్టి ఢిల్లీ పైనే ఎక్కువ ఉండబోతుందని చెప్పే మరో పని చేసారు. రాహుల్ గాంధీ టీవీ ఇంటర్వ్యూ తర్వాత ఢిల్లీ సిక్కుల ఊచకోతపై దేశం మళ్ళీ దృష్టి సారించిన దశలో కేజ్రీవాల్ 1984 ఘటనలపై మళ్ళీ విచారణ కమిషన్ వేయాలని డిమాండ్ చేసారు. గతంలో జరిగిన SIT దర్యాప్తు అల్లర్లలో కాంగ్రెస్ నాయకుల పాత్ర ఏమీ లేదని తేల్చింది. సజ్జన్ కుమార్ లాంటి నాయకులు క్లీన్ చిట్ తో బయట పడ్డారు. ఒక వైపు 2002 గుజరాత్ అల్లర్ల గురించి మోడీ ఎప్పటికైనా సమాధానం చెప్పుకుంటూ ఉండే పరిస్తితిలోనే ఉండబోతున్నారు. అలాంటి దశలో కేజ్రేవాల్ కనీసం ఢిల్లీ పరిదిలోనైనా కాంగ్రెస్ ను దోషిగా నిలిపి రాజకీయ పరంగా మార్కులు కొట్టివేయాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు.

మళ్ళీ SIT వేయాలనడంతో పాటు, ఉరి కోసం ఎదురు చూస్తున్న ఖలిస్తాన్ తీవ్రవాది దేవిందర్ పాల్ సింగ్ భుల్లర్ కు క్షమాభిక్ష పెట్టాలని కూడా కేజ్రీవాల్ డిమాండ్ చేసారు. విపరీతమైన ఆలస్యం అయిన కేసుల్లో ఉరిశిక్ష పడ్డ వాళ్ళ శిక్షను తగ్గించాలని ఈ మధ్య సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం ఆధారంగా భుల్లర్ కూడా తన శిక్ష తగ్గించాలని నిన్ననే సుప్రీం లో పిటిషన్ వేసాడు.

మొత్తానికి AAP వచ్చే సాధారణ ఎన్నికలలో ఢిల్లీ గడ్డ పై పీఠం బలంగా వేసుకోవాలనే ప్రయత్నం మొదలుపెట్టినట్లే ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy