గడాఫీతో కత్రినా

GHADAFIబాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్ కత్రినా కైఫ్‌… సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకముందు మోడలింగ్‌ రంగంలో కొనసాగారు. మోడల్‌గా ఆమె గతంలో దిగిన ఫొటోలు, వీడియోలు అప్పుడప్పుడు ఇంటర్నెట్‌లో వెలుగులోకి వస్తున్నాయి. ఆమె గతంలో దిగిన ఓ ఫొటో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌ లో వైరలవుతోంది. కారణం ఆమెతోపాటు ఆ ఫొటోలో ఉన్నది ఒక కరుడుగట్టిన నియంత.

లిబియాకు చెందిన నియంతృత్వ పాలకుడు మౌమ్మర్‌ గడాఫీతో కత్రినా కైఫ్‌ గతంలో దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఫొటోలో కత్రినతోపాటు సినీ నటులు నేహా ధూపియా, ఆదితి గొవిత్రికర్‌, అంచల్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు. లిబియాలో ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న సమయంలో తీసిన ఈ ఫొటోను మోడల్‌ షమితా సింఘా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ‘లిబియాలో మనం ఫాషన్‌ షోలో పాల్గొని దాదాపు 15 ఏళ్లు పూర్తవుతున్నది. అప్పుడు గడాఫీని కలిసే అవకాశం దక్కింది. ఈ పర్యటన గుర్తున్నాదా’ అంటూ ఆమె కామెంట్‌ చేసింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy