గణేశ్ నిమజ్జనానికి 23వేల మందితో భద్రత

GaneshEmersion_17092013గణేష్ నిమజ్జనం రాష్ట్ర వ్యాప్తంగా గ్రాండ్ గా జరుగుతోంది. నవరాత్రోత్సవాలు ముగింపుకు చేరడంతో భారీగా గణపతులు నిమజ్జనానికి తరలుతున్నారు. అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. శోభయాత్ర జరిగే రూట్లలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పలు చోట్ల రేపు ట్రాఫిక్ డైవర్ట్ చేశారు.

గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. రేపు నిమజ్జనానికి గణపతులు భారీగా తరలివస్తుండటంతో హెవీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు . శోభయాత్రలు జరిగే రూట్లలో 23 వేల మందితో భద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పలు రూట్లను డైవర్ట్ చేసి క్లియర్ చేస్తున్నారు.  గణేష్ శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు నగర పోలీసులు. 9 కంపనీల కేంద్ర బలగాలతో పాటు ఏపీ, ఛత్తీస్ ఘడ్ ల నుండి రప్పించిన అదనపు పోలీసు బలగాలు రప్పించారు. పాతబస్తీ మీదుగా సాగే గణేష్ శోభాయాత్రకు సీసీ కెమెరా నిఘాలో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేసారు. నిమజ్జనం జరిగే అన్ని ప్రాంతాల్లో 170 పెట్రోలింగ్ వాహనాలు, 90 మొబైల్ క్రేన్లను అందుబాటులో ఉంచనున్నారు పోలీసులు.

రేపు ఉదయం బాలాపూర్ నుండి హుస్సేన్ సాగర్ వరకు సాగే  గణపతి శోభాయాత్రకు ఫుల్ సెక్యూరిటీ ఆరేంజ్ చేశారు. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టారు.  900 వైర్ లెస్ సెట్లతో నిరంతరం సిబ్బందిని అలర్ట్ చేసేలా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే బాలాపూర్ గణపతి శోభయాత్ర ఓల్డ్ సిటీ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంటుంది. గణపతుల శోభయాత్ర జరిగే అన్ని రూట్లలో నిఘా పటిష్టం చేశారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నిమజ్జనం అయిపోయేంత వరకు నగరంలో వైన్స్, బార్లును బంద్ చేయించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy