గతమెంతో ఘనకీర్తి…

cpi 90ఎవరు అవునన్నా… కాదన్నా… జన  చైతన్యానికి కేరాఫ్ అడ్రస్ CPI. స్వాతంత్ర్య పోరాటంలో… జనప్రవాహానికి దిక్చూచి. కార్మిక, కర్షక పోరాటాలకు ఊపిరి కమ్యూనిస్టులు. స్వతంత్ర భారతంలో పార్టీ చీలికలై పోయినా.. ఇంకా ఉనికిలోనే ఉంది. తొలినాళ్లలో ఉన్న ఊపు, ఉత్సాహం ఇప్పుడు లేదు. పార్టీ వయస్సు పెరుగుతున్నకొద్దీ… దాని ప్రభావమూ తగ్గుతోంది. 90 వ వార్షికోత్సవం జరుపుకుంటోన్న సీపీఐపై స్పెషల్ స్టోరీ.

భారతీయ కమ్యూనిస్టుల చరిత్ర రాస్తే రామాయణం, వింటే మహాభారతం. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ సంస్థ  కొమింటర్న్ ప్రత్యక్ష సహకారం, పర్యవేక్షణలో ఎన్నో ఆటుపోట్లు, ఆంక్షల మధ్య  1925 డిసెంబర్ 26న కాన్పూరు నుంచి సీపీఐ ప్రస్థానం మొదలైంది. బ్రిటిష్ పాలకుల్ని పారదోలి స్వాతంత్రాన్ని సంపాదించడం, సోషలిస్టు సమాజ స్థాపన దిశగా స్వతంత్ర భారతాన్ని నడపడం లక్ష్యాలుగా ప్రకటించింది.

1942 జూలైలో నిషేధాన్ని ఎత్తివేసేంత వరకు దేశవ్యాప్తంగా పని చేయలేదు సీపీఐ. తర్వాత దేశమంతా  విస్తరించింది. కార్మిక, కర్షక పోరాటాలకు ఊపిరిలూదింది. నిషేద సమయంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టనష్టాలను చూసింది. అయినా బాగా బలపడింది సీపీఐ. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో సీపీఐ ప్రధాన  ప్రతిపక్షంగా నిలిచింది.

1960లో కమ్యూనిస్టులు సీపీఐ, సీపీఎంలుగా చీలిపోయారు. కమ్యూనిస్టు ఉద్యమం చీలి 50 ఏళ్లు దాటింది. చీలిక సమయంలో బీహార్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బలంగా ఉన్న సీపీఐ.. ప్రస్తుతం నామ్ కే వాస్తేగా మిగిలిపోయింది.  1980ల తర్వాత  సీపీఐ తన విధానాన్ని మార్చుకున్నా ఫలితం లేకపోయింది. గత రెండున్నర దశాబ్దాల కాలంలో పార్టీ కార్యక్రమాల్లో గానీ, విధానాల్లో గానీ ఎటువంటి తేడాలు లేకపోవడమే ఇందుకు సాక్ష్యం. తప్పులు, దిద్దుబాట్లే సరిపోయాయి. ఏ అవకాశాన్నీ అందిపుచ్చుకోలేక పోయారు కమ్యూనిస్టులు.

జల్, జంగల్, జమీన్ అనే పదాలు ఈవేళ అందరికీ దూరమయ్యాయి. భారతీయ యువత కమ్యూనిస్టుల వైపు చూడని సిచ్యువేషన్.  అస్తిత్వ పోరాటంలో ఉన్న కమ్యూనిస్టులు ఇప్పటికైనా ఏక తాటిపైకి రావడమే శరణ్యం. 90ఏళ్ల చరిత్రలో…గతమే సీపీఐ ఘనత. రానున్నకాలంలో అప్ డేట్ కాకపోతే…చరిత్ర పుస్తకాల్లోనే చదువుకోవాల్సివస్తుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy