గతుకుల రోడ్లతో అవస్థలు

GROUND-IMAGE1-300x18714అదో మండల కేంద్రం. కాని అక్కడికి పోవాలంటే కనీసం రోడ్డు సౌకర్యం ఉండదు.  చుట్టుపక్కల గ్రామాలే నుంచే  కాదు.. డిజవిన్, జిల్లా కేంద్రం నుంచి కూడా రోడ్డు ఫెసిలిటీ లేని పరిస్థితి. దీంతో ఆ మండలంలో జనాలకు విద్యా, వైద్యం అందడం లేదు. అభివృద్ది అంటేనే అసలు వారికి తెలియదు. కనీస సౌకర్యాలు లేక అరిఘోస పడుతున్న గుండాల వాసులపై వీ6 గ్రౌండ్ రిపోర్ట్.

 

ఖమ్మం జిల్లాలోని గుండాల మండల హెడ్ క్వార్టర్ కు వెళ్లే రూట్. గుండాల మండలం ఇల్లందు డివిజన్ లో ఉంటుంది.  గుండాల మండల కేంద్రానికి ఇల్లందు నుంచి.. కానీ మండలంలోని ఇతర గ్రామాల నుంచి కూడా రోడ్డు ఫెసిలిటీ లేదు. మామూలు జనాలైనా.. ప్రభుత్వాధికారులైనా గుండాల పేరెత్తుతేనే వామ్మో అంటారు. అక్కడ ఉద్యోగం వచ్చిదంటే చుక్కలు చూడాల్సిందే. ఈ ఏరియాలో జాబ్ చేయడానికి ససేమిరా అంటారు  ఉద్యోగులు. గుంతలమయమైన ఈ మట్టి రోడ్డుపై అష్టకష్టాలు పడి.. క్షణమొక నరకంగా  ప్రయాణం చేస్తారు  స్థానికులు. ఈ రూట్ లో బావుల దగ్గరికి వెళ్లేవాళ్లు  సద్ది పట్టుకుపోతే.. అక్కడికి వెళ్లే సరికి అన్నం, కూర కలిసిపోతుంది. కూర కలపాల్సిన పనే ఉండదు. ్రెగ్నెన్సీ లేడీస్ పరిస్థితి మరీ దారుణం. గుండాల నుంచి.. హాస్పిటల్ కు తీసుకెల్తే ..మధ్యలోనే డెలివరీ అయిన సందర్బాలున్నాయని చెబుతున్నారు స్థానికులు. వెహికిల్స్ నడపలేక ఎడ్ల బండి ప్రయాణం చేస్తున్నారు.

ఒకటా రెండా 60 కిలోమీటర్ల ప్రయాణం నరకాన్ని చూపిస్తుంది.  ఈ రూట్ లో టూ వీలర్ నడపాలంటే అదో సాహస యాత్ర. కనురెప్ప పాటు ఆదమరచినా అంతే సంగతులు. గుండాల వెళ్లాలంటే ట్రాక్టర్లు, జీపులే దిక్కు. రాళ్లు రప్పలతో.. అడుక్కో గుంతతో నాలుగైదు గంటల నరకప్రయాణం చేయాల్సి ఉంటుంది. గుంతలమైన రోడ్డుపై ప్రయాణంతో … కడుపులో పేగులు నోట్లోకి వచ్చేస్తాయ అన్న ఫీలింగ్ కలుగుతుందని చెబుతున్నారు స్థానికులు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 67 ఏళ్లైనా.. రోడ్డు లేని మండల కేంద్రం ఉందంటే ఇది ప్రభుత్వాల పనితీరుకు నిదర్శమంటున్నారు స్థానికులు.

ఇల్లందు నుంచి గుండాలకు వెళ్లాలంటే  కొమరారం పోలారం. బొంబాయితండా, కోటన్ననగర్, మర్రిగూడెం, ముత్తాపురం యాపలగడ్డ నుంచి వెళ్లాలి. ఈ రూట్ లో ఎక్కడైనా వెహికిల్ పాడైందంటే చుక్కలే. రోడ్డు వెయించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ..పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. ఖమ్మం జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన వారిలో ముగ్గురంటే ముగ్గురు మాత్రమే గుండాలకు వచ్చారని చెబుతున్నారు. రోడ్డు ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం.. రాజకీయ నేతలు అందరూ ఫెయిల్ అయ్యారు. ఏళ్లు గడుస్తున్నా గుండాలకు రోడ్డు లేకపోవడంతో.. జనం తిప్పలు పడుతున్నారు. గుండాలలో మల్లన్నవాగు ఉంది. ఇక్కడి నుంచి ఎండకాలం మాత్రమే బస్సులు నడుస్తాయి. తర్వాత వాగు ప్రవహిస్తే.. బస్సులు నడవవు. వరంగల్, నర్సంపేట, ములుగు, పసర వాసులు..గుండాలకు వెళ్లాలంటే ఈ మల్లన్న వాగు నుంచి వెళితే 40 కిలో మీటర్లు. అదే ఇల్లందు నుంచి వెళితే దాదాపు 120 కి. మీ ఉంటుంది. దీంతో ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు స్థానికులు. కానీ ఏళ్లు గడుస్తున్న అది ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని చెబుతున్నారు అధికారులు. స్కూల్ విద్యార్థుల తిప్పలు అంతా ఇంతా కాదు. వైద్యం కోసం వెళ్లేవారు వాగు దాటేందుకు అవస్థలు పడుతున్నారు. స్కూల్, కాలేజీ కోసం గుండాలకు వెళ్లాలంటేనే నో చెబుతున్నారు విద్యార్థులు. ఎత్తు ఒంపుల రోడ్డుపై ప్రయాణిస్తే ..బ్యాక్ పేయిన్ వస్తుందని చెబుతున్నారు. డిస్క్ ప్లాబ్లమ్ వచ్చి..హాస్పిటళ్ల పాలవుతున్నామని చెబుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆఫీసులలో పనిచేసే అధికారులు.. ప్రజలకు పూర్తిస్ధాయి సేవలు అందించలేకపోతున్నారు. ఇక్కడికి అధికారులను ట్రాన్స్ ఫర్ చేశారంటే అది.. పనిష్మెంట్ కోసమే అన్న ప్రచారం జరుగుతోంది.

గుండాల మండలంలో ఆదీవాసీ..గిరిజనులు  ఎక్కువగా ఉంటారు. వీరికి అభివృద్ది అంటేనే తెలియదు. వీరి పరిస్థితి ముంపు మండలాల కంటే అధ్వాన్నంగా ఉంది. రాష్ట్రంలోనే రోడ్డు సరైన రోడ్డు సౌకర్యం లేని మండల హెడ్ క్వార్టర్ ఉందంటే అది గుండాలే.  ఇప్పటికైనా సర్కార్ నిర్ణయం తీసుకొని రోడ్డు వేయించాలని కోరుతున్నారు గిరిజనులు. తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే..ఈ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy