గద్వాలలో వజ్రాల కలకలం

mbnr andaaమహబూబ్ నగర్ జిల్లా గద్వాలలోని కూరగాయల మార్కెట్ దగ్గర తవ్వకాల్లో ఓ పురాతన గంగాళం బయటపడింది. అభివృద్ధి పనుల్లో భాగంగా ఇక్కడ జేసీబీతో తవ్వుతున్నారు. ఈ పాత్ర మొత్తం సీల్డ్ చేసి ఉంది. మూతపైన రేకులతో క్లోజ్ అయ్యి ఉంది. ఇందులో బంగారు నాణాలు లేదా వజ్రాలు ఉండొచ్చనే ప్రచారం జరుగుతుంది. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు ఈ పాత్రను ఎమ్మోర్వో ఆఫీస్ కు తరలించారు. పురావస్తుశాఖ వారికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న గద్వాల జనం తండోపతండాలుగా మార్కెట్ కు తరలివస్తున్నారు. ఎమ్మార్వో ఆఫీస్ లోనూ భద్రత మధ్య దీన్ని ఉంచారు. ఓపెన్ చేస్తేగానీ అందులో ఏ ముందే తెలియదు.. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గద్వాల రాజుల పరిపాలనలో ఉంది. ఈ ప్రాంతంలో గుప్తనిధుల కోసం తరచూ తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి.

mbnr andaaa

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy