గద్వాల అభివృద్ది కి రూ.100 కోట్లు మంజూరు : సీఎం కేసీఆర్

CM-KCR-Full-Speech-At-TRS-Public-Meeting-In-Gadwalజోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. శుక్రవారం(జూన్-29)న జిల్లాలో పర్యటించిన కేసీఆర్… గద్వాలలో జరుగుతున్న నడిగడ్డ ప్రగతి సభకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గద్వాలకు వరాల జల్లు కురిపించారు. గద్వాల ఆస్పత్రిని 300 పడకల ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు జిల్లాకు ఎస్సీ స్టడీ సర్కిల్, రెసిడెన్సియల్ పాఠశాల మంజూరు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. 584 మండలాల్లో బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు.

వచ్చే ఏడాది కూడా మరో 119 బీసీ గురుకుల స్కూల్లను ఏర్పాటు చేస్తామన్నారు. గద్వాల బస్టాండ్ అభివృద్ది కోసం రూ.2కోట్లు మంజూరు చేస్తామన్నారు. జూరాల దగ్గర బృందావనం ఏర్పాటు కోసం రూ.15కోట్లు మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ కోతలు ఎక్కువ అవుతాయని గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. అయితే రైతులకు 24గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. రైతు పెట్టుబడి పథకంపై కాంగ్రెస్  చిల్లర రాజకీయాలు చేస్తోందన్నారు.

గట్టు ఎత్తిపోతల పూర్తయితే నడిగడ్డలో 1.20లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల తాగునీరందిస్తామన్నారు. ఇంకా ఎన్ని రిజర్వాయర్లు అవసరమో ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. అవసరమైన పంప్ హౌజ్ లు, కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రెండో దశలో మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు.

దేశం మొత్తం తెలంగాణ వచ్చి అధ్యయనం చేసేలా అభివృద్ది చేస్తామన్నారు సీఎం కేసీఆర్. రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే డిమాండ్ ఉన్న పంటనే వేయాలన్నారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేశామన్నారు. రైతులు మిగులు డబ్బులు చూసే రోజు రావాలన్నారు. రైతు సమన్వయ సమితుల ద్వారా సాగుసమాచారం పూర్తిగా ఉందన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నారు. రాష్ట్రాన్ని పంటల కాలనీలుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. మిగతా 28 రాష్ట్రాల రైతులు తెలంగాణను చూసి నేర్చుకునేలా ఎదగాలన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించామన్న సీఎం కేసీఆర్….తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy