గన్ పార్క్ దగ్గర విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్: గన్ పార్క్ దగ్గర విద్యార్థి రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో కొందరు విద్యార్థులు ఆందోళన చేశారు. ఇంజినీరింగ్ లో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐదు లక్షల ఉద్యోగాలను ఆరు నెలల్లో భర్తీ చేయాలన్నారు. ఇంజినీరింగ్ , ఇతర ఉన్నత చదవులు చదువుతున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అందరికీ ఉన్నత ప్రమాణాలతో ఉచిత విద్య, వైద్యం అందించాలన్నారు. గన్ పార్క్ దగ్గర ఆందోళన చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy