గవర్నర్ ఆప్యాయతకు ట్రాఫిక్ పోలీసులు ఫిదా

governor-diwaliగవర్నర్ నరసింహన్ సామాన్యులలో బాగా కలిసిపోతారు. ఎక్కడికి వెళ్లినా… ఏం చేసినా ఆయన రూటే సపరేటు. వివరాల్లోకి వెళితే.. దీపావళి వేడుకలు రాజ్ భవన్ లో గురువారం ఉదయం గ్రాండ్ గా జరిగాయి. వీవీఐపీలతో పాటు సాధారణ ప్రజానీకం పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొన్నారు. అందరినీ గవర్నర్ దంపతులు ఆత్మీయంగా పలకరించారు. అయితే దీనికి ముందు ఆయన.. ట్రాఫిక్ సిబ్బందికి మధురానుభూతిని మిగిల్చారు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఆయన కాన్వాయ్ వెళుతోంది. ట్రాఫిక్ క్లియర్ చేసి.. ఆయన వెళ్లడానికి అనువుగా ఏర్పాట్లు చేశారు పోలీసులు. గవర్నర్ వెళ్లిపోతారనుకుంటుండగా.. తన కాన్వాయ్ ను ఆపించారు. ఏం జరిగిందో ఏమోనని ట్రాఫిక్ పోలీసులు భయపడుతుండగా.. తన బండి నుంచి మెల్లగా దిగి  అక్కడి ట్రాఫిక్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రథమ పౌరుడు తమను ప్రేమగా పలకరించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ట్రాఫిక్ సిబ్బంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy