గవర్నర్ నరసింహన్ కు ‘అగష్టా’ కష్టాలు..?

downloadరాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు అగష్టా కష్టాలు రానున్నాయి. నరసింహన్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసేందుకు సీబీఐ చూస్తోంది. వీవీఐపీ హెలికాఫ్టర్ల కొనుగోళ్లల్లో ఆయన స్టేట్ మెంట్ కీలకం కానుందని సీబీఐ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల గవర్నర్లను ప్రశ్నించిన సీబీఐ  ‘ఐ’ ఇప్పుడు నరసింహన్ పై పడింది. 2005లో డీల్ కుదుర్చుకునే టైంలో మీటింగ్ లో ఉన్నారని మాజీ గవర్నర్లు నారాయణన్, వాంచో ల స్టేట్ మెంట్లను సీబీఐ రికార్డ్ చేసింది. రూ.360 కోట్ల లంచాలు కట్టుబెట్టారంటూ వీరిని సీబీఐ వారం రోజుల క్రితం ప్రశ్నించింది.

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్న నరసింహన్ కూడా హెలికాప్టర్ల కొనుగోలు డీల్ లో ఉండటంతో అతని స్టేట్ మెంట్ కూడా రికార్డు చేయాలని సీబీఐ భావిస్తోంది. ఇప్పటికే మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ త్యాగితో సహా మరి కోనుగోళ్లతో సంబంధం ఉన్న కొంత మంది ఇరోపియన్లపైన కేసులు బుక్ చేసింది. మరో రెండ్రోజుల్లో నరసింహన్ ను ప్రశ్నించే అవకాశం ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy