గవర్నర్ నివేదిక ఇంకా అందలేదు: షిండే

images
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలా.. లేక కొత్త ప్రభుత్వ ఏర్పాటు గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే. గవర్నర్ నరసింహన్ పంపిన నివేదిక ఇంకా అందలేదన్నారు. ఈ రోజు నివేదిక అందే అవకాశం ఉందన్నారు. నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిపాలన గురించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ రోజు ఉదయం సోనియాతో భేటీ అయ్యారు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తేదీ ఎప్పటి నుంచి అమల్లోకి రావాలన్న అంశంపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy