గవర్నర్ రేసులో 16 ఏళ్ల కుర్రోడు

kidsరాజకీయాల్లో తిరగానికి వయస్సుతో సంబంధం లేకున్నా…ఏదైనా పదవికి పోటీ చేయాలంటే మాత్రం ఏజ్ తప్పని సరి.అయితే కనీసం ఓటు హక్కు కూడా లేని ఓ విద్యార్థి  ఏకంగా గవర్నర్ పదవి కోసం పోటీకి దిగాడు. అంతే కాదు ప్రచారం చేస్తూ ఆ దేశ ప్రజల దృష్టిని తన వైపునకు తిప్పుకున్నాడు. ఈ పోటీ అమెరికాలోని కాన్సాస్‌ లో జరుగుతోంది.

అమెరికాలో గవర్నర్‌ కావాలంటే కనీస వయసు సాధారణంగా 30 ఏళ్ల ఉండాలి. కొన్ని రాష్ట్రాలకు మాత్రం 25, 21, 18 ఏళ్లు ఉండగా ఓక్లాహామాకు మాత్రం 31 కనీస వయసు ఉండాలి. అయితే.. ఒక్క కాన్సాస్‌, వర్మోంట్‌కు మాత్రం ఇంత వయసు ఉండాలని స్పష్టత లేదు.

జాక్‌ బర్గ్‌సన్‌ అనే 16 ఏళ్ల హైస్కూల్‌ విద్యార్థి 2018లో జరగనున్న కాన్సాస్‌ ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ తరుపున బరిలోకి దిగుతుండగా ఇతడికి పోటీగా మరో హైస్కూల్‌ స్టూడెంట్‌ అలెగ్జాండర్‌ క్లైన్‌  పోటీకి రెడీ అవుతున్నాడు. ఇందులో వింత ఏంటంటే… పోటీకి దిగుతున్న వీరిద్దరికీ కనీసం ఓటు హక్కు కూడా లేదు. బుధవారం (ఆగస్టు9) ఏబీసీ నెట్‌ వర్క్‌లో ప్రచారమైన జిమ్మీ కిమ్మెల్‌ లైవ్‌ అనే కామెడీ కార్యక్రమంలో పాల్గొని జాక్‌ బర్గ్‌సన్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.

వచ్చే ఏడాది ఈ ఇద్దరు విద్యార్థుల స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తి కానుంది. కాన్సాస్‌కు గవర్నర్‌గా పోటీ చేసే వ్యక్తికి ఎంత వయసు ఉండాలనే విషయంలో ప్రత్యేక నిబంధనలు లేని కారణంగానే వీరిద్దరు పోటీలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాక్‌కు ఫండ్స్ కూడా వస్తున్నాయంట. 1300 డాలర్ల ఫండ్‌ అప్పుడే తనకు చేరినట్లు జాక్‌ తెలిపాడు. యువకులను ఎవరూ సీరియస్‌గా తీసుకోరని తాను తెలుసుకున్నామన్నాడు. అయితే, కాన్సాస్‌ ప్రజలు ఇక పాత తరహా రాజకీయాలను ఏమాత్రం భరించబోరని తమతోనే మార్పును ఆహ్వానిస్తారని భావిస్తున్నట్లు తెలిపాడు జాక్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy