గాంధీ గురించి మోదీకి తెలిసింది శూన్యం: రాహుల్

mo

గుజరాత్ లో పర్యటించారు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. బర్దోలిలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రిపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. RSS సిద్ధాంతాలు విషం లాంటివన్న ఆయన, మహాత్మ గాంధీ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఉన్నాయని విమర్శించారు. పటేల్, గాంధీజీల గురించి మోదీకి తెలిసింది శూన్యమన్నారు. పటేల్ విగ్రహ నిర్మాణానికి చూపిస్తున్న శ్రద్ధ ఆయన సిద్ధాంతాలు కాపాడేందుకు చూపించడం లేదని మండిపడ్డారు. గాంధీజీ హత్య తర్వాత పటేల్ RSS ను రద్దు చేయాలని చెప్పారన్నారు. అలాంటిది ఇప్పుడు గుడి కట్టడమే ఎజెండాగా ఉన్న పార్టీ దేశాన్ని మళ్ళీ కల్లోల పరచాలని చూస్తుందని వార్నింగ్ ఇచ్చారు. మోదీ చాయ్ అమ్ముకున్న వ్యక్తి అనే అంశం పై BJP చాలా ఎక్కువ ప్రచార లబ్ది పొందాలని చూస్తున్నదని, వ్యక్తికి గౌరవమివ్వడం అతని స్థాయిని బట్టి ఉండదని, చాయ్ అమ్ముకునే వ్యక్తికీ కూడా ఈ దేశంలో సరైన స్థానమే ఉంటుందని, కానీ ఆర్భాటపు మాటలు చెప్పి మోసం చేయాలనుకునే వ్యక్తులను దూరంగా పెట్టాలని, అలాంటి వారి గురించి జాగ్రత్తగా ఉండాలని రాహుల్ అన్నారు.

ఇక నరేంద్ర మోదీ పాలనపై తనదైన స్టైల్లో ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. గుజరాత్ లో కేవలం ధనవంతులకు మాత్రమే ప్రభుత్వపాలన నడుస్తోందని మండిపడ్డారు. తాము ప్రజలకు అధికారం ఇవ్వాలనుకుంటున్నామని కానీ గుజరాత్ లో ఒక్కరి చేతిలోనే ప్రభుత్వం నడుస్తొందని విమర్శించారు.  తాము పేదరికాన్ని తొలగించాలంటే ఇక్కడ ఏకంగా పేదలనే తొలగిస్తున్నారని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy