గాజులు అమ్మి…. ఐఏఎస్ అయ్యాడు : పేదరికాన్ని జయించిన పోలియో బాధితుడు

కృషి… పట్టుదల ఉంటే.. ఏదైనా సాధించవచ్చని నిరుపించాడీయన. పేదరికంలో పుట్టి.. చదువుకోవడానికి వసతులు లేకపోవడంతో… గాజులు అమ్మాడు. ఉన్నత చదువులే లక్ష్యంగా… కష్టించి విద్యార్థి స్థాయి నుంచి… ఐఎఎస్ క్యాడర్ స్థాయి వరకు ఎదిగాడు. అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే… పేద విద్యార్థులకు చేయూత అందిస్తూ… ఆదర్శంగా నిలుస్తున్నాడు మహారాష్ర్టకు చెందిన రమేశ్ ఘోలప్.

మహారాష్ర్ట… సోలాపూర్ జిల్లా బర్షీ తాలుకాలోని మహాగోగన్ గ్రామంలో జన్మించాడు రమేశ్ ఘోలప్. చిన్నప్పటినుంచే చురుకైన పిల్లాడు. తండ్రి గోరఖ్ ఘోలప్ సైకిల్ రిపేర్ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే తండ్రి తాగుడుకు బానిసై రమేశ్ చిన్న తనంలోనే చనిపోయాడు. కుటుంబ బాధ్యతలు తల్లి (విమల్ ఘోలప్) తీసుకుంది. సొంతూరులోనే గాజుల షాపు నడుపుతూ కుటుంబానికి అండగా ఉండేది.  చిన్న వయస్సులోనే పొలియో బారిన పడిన రమేశ్.. తన అన్నతో కలిసి తల్లికి సాయం చేసేవాడు. ఆ గ్రామంలో ఒకే ఒక్క ప్రైమరీ పాఠశాల ఉంది. మామ సహకారంతో ఆ పాఠశాలలో జాయిన్ అయ్యాడు.

ఉన్నత విద్యతోనే పేదరికాన్ని జయించవచ్చని నమ్మిన రమేశ్ కష్టపడి చదవడం మొదలు పెట్టాడు. పేదరికం వెంటాడుతున్నా… బ్రిలియంట్ స్టూడెంట్ గా గుర్తింపు పొందాడు. 88 శాతం మార్కులతో ఫైనల్  ఎగ్జామ్ లో పాసయ్యాడు. ఆ తర్వాత టీచర్ గా పనిచేశాడు. తండ్రి మరణంతో తల్లికి వచ్చే ప్రభుత్వ పింఛన్ రాకపోవడం… బాధ్యతయుతంగా పనిచేయాల్సిన అధికారులు సక్రమంగా పనిచేయకపోవడం… రమేశ్ ను ఎంతగానో బాధించాయి. తానో ప్రభుత్వ అధికారి అయితైనే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని భావించాడు.

కుటుంబ సహకారంతో.. టీచర్ల గైడెన్స్ తో సివిల్స్ కు సిద్ధమయ్యాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా… కష్టాల అధిగమించి ఐఏఎస్ సాధించాడు. ప్రస్తుతం జార్ఖండ్.. ఎనర్జీ డిపార్ట్ మెంట్ లో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న రమేశ్ ఎంతోమంది విద్యార్థులకు అండగా నిలుస్తున్నాడు. సివిల్స్ ప్రిపరయ్యే విద్యార్థుల కోసం అవసరమైన స్కిల్స్ అందిస్తున్నాడు.. ఒకప్పుడు గాజులు అమ్మిన అబ్బాయి.. పేదరికాన్ని, పోలియో బాధలను జయించి.. ఐఏఎస్ క్యాడర్ స్థాయి ఎదిగాడు. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది యువత సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy