గాడియం స్కూల్ లో ప్రమాదం : ముగ్గురు కూలీలు మృతి

The-Gaudium-Schoolసంగారెడ్డి జిల్లా BDL భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం. పొట్టకూటి కోసం వచ్చిన ముగ్గురు కూలీల మరణం కలకలం రేపుతోంది. వెలిమల గ్రామంలో గాడియం స్కూల్ ఉంది. ఈ స్కూల్ ఆవరణలోనే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆరు అడుగుల గుంత తవ్వారు. అందులో పైప్ లైన్లు వేస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల మట్టిపెళ్లలు.. గుంతలోని కూలీలపై పడ్డాయి. ముగ్గురు కూలీలు మట్టి కింద కూరుకుపోయారు. ఈ ఘటన చూసిన మిగతా కూలీలు, స్థానికులు వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రకాష్ (20), వికాస్ (20), మనసా (20) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై BDL పోలీసులు కేసు నమోదు చేశారు. వీరు ఒరిస్సా నుంచి వచ్చిన కూలీలుగా గుర్తించారు.  నిర్లక్ష్యం ఎవరిది.. ప్రమాదం ఎందుకు, ఎలా జరిగింది అనే విషయాలను విచారిస్తున్నారు. ఈ ఘటనతో గాడియం స్కూల్ దగ్గర సెక్యూరిటీ పెంచారు. ఎవర్నీ లోపలికి అనుమతి ఇవ్వటం లేదు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy