గాడ్ ఫాదర్ దొరికాడు

el-chapo-guzmanమనోడు స్కెచ్ వేస్తే…పెచ్చులు ఊడాల్సిందే. ట్రయల్ వేస్తే..దిమ్మదిరగాల్సిందే. డ్రగ్స్ దందాతో స్మగ్లర్ అయ్యాడు. టన్నుల కొద్దీ డ్రగ్స్ సప్లై చేశాడు. వేల కోట్లు దోచేశాడు. వేల మందిని బలితీసుకున్నాడు. మెక్సికోను హడలెత్తించాడు..అమెరికాకు షివరింగ్ తెప్పించాడు. జైల్లో ఉంటే కన్నాలు వేస్తాడు..బయట ఉంటే వేశాలేస్తాడు. చిక్కినట్టే చిక్కి..తుర్రుమంటాడు. ఇప్పటికే రెండుసార్లు పోలీసులకు చిక్కి..ఎస్కేప్ అయ్యాడు. ముచ్చటగా మూడోసారి చిక్కాడు… గాడ్ ఫాదర్ ఆఫ్ డ్రగ్స్ వాల్డ్ ఎల్ చాపో. డేంజరెస్ క్రిమినల్ లార్డ్ ఆఫ్ టన్నెల్ పై ప్రత్యేక కథనం….

మోస్ట్ వాంటేడ్ స్మగ్లర్ జోవాక్విన్ ఎల్ చాపో గుజ్ మన్ టెర్రర్ కే టెర్రర్. అటు మెక్సికో..ఇటు అమెరికాను మడతేస్తున్న డేంజరస్ క్రిమినల్. డ్రగ్స్ దందాతో రెండు దేశాల్ని ఆటాడిస్తున్నాడు. సొంత సైన్యంతో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న  జోవా క్విన్..కింగ్ ఆఫ్ డ్రగ్స్ గా రాజ్యాన్ని ఏలుతున్నాడు. కొకైన్, హెరాయిన్, మారిజునా సప్లైలో వెరీ స్పెషల్ గుజ్ మన్. ఈ పొట్టివాడు మహా గట్టివాడని ప్రపంచానికి సవాల్ విసిరాడు ఎల్ చాపో.

ఊసరవెల్లిని మించిపోయాడు…

ఊసరవెల్లికి కూడా పాఠాలు నేర్పించే కన్నింగ్ కహానీ గుజ్ మన్ సొంతం. డబ్బుతోనే పనులు చేస్తాడు…డబ్బుతోనే పనులు చేయిస్తాడు. ఇందులో మనోడు మహా గడసరి. దేన్నైనా డబ్బులతోనే చుట్టేస్తాడు.ఒకరిని టార్గెట్ చేయాలన్నా…ఎస్కేస్ కావాలన్నా…కాసులతోనే అన్ని సర్దేస్తాడు గుజ్ మన్.  దందాను ఎంత పర్ ఫెక్ట్ గా చేస్తాడో.. జైలు నుంచి ఎస్కెపింగ్ లోనూ గ్రేట్ స్పెషలిస్టు. ఎంతగా సెక్యూరిటీ ఉన్నా..ఈజీగా ఉడాయించడం మనోడికి తెలిసినంతగా మరేవరికీ తెలియదు. జైల్ గోడలు బద్దలు కావు…జైలు ఊచలు ఊడిపోవు…ఒక్క పోలీస్ గాయపడడు…జైలు గదికి వేసిన తాళం వేసినట్టు ఉంటుంది..కానీ మనోడు మాత్రం అక్కడ ఉండడు…అదే గుజ్ మన్ స్పెషాలిటీ.

గుజ్ మన్ జీవితం… సినిమాకు తగ్గని కథ

guzmanగుజ్ మన్ క్రైమ్ కహానీ… హాలీవుడ్ రేంజ్ కంటే ఎక్కువే. సినిమాల్లోని విలన్ లాగే గుజ్ మన్ రక్త చరిత్ర సింపుల్ గా మొదలైంది. మెక్సికోలోని బాదిరెగ్యుటా మనోడి బర్త్ ప్లేస్. సినాలోవా కోస్టల్ ఏరియాలో ఉంటుంది ఈ ఊరు. తన నేర సామ్రాజ్యాన్ని ముద్దుగా సినాలోవా డ్రగ్ కార్టెల్ గా పిలుచుకుంటాడు. ఈ ఏరియా డ్రగ్స్ దందాకు కేరాఫ్. ఎల్ చాపో తండ్రి వృత్తి ..పశువుల పెంపకమని చెప్పుకున్నా చేసిన పని గంజాయి పెంచడమే. అతని బంధువులదీ అదే దుకాణం. తాగుబోతు తండ్రి, పేదరికం.. ఎల్ చాపోను డ్రగ్స్ దందావైపు  నడిపించాయి.

గుజ్ మన్ టార్గెట్..మెక్సికో , అమెరికానే. 1990..2008 వరకు నేర సామ్రాజ్యాన్ని బోర్డర్ దాటించాడు. ఈ 18 ఏళ్లల్లో దాదాపు 2వందల టన్నుల డ్రగ్స్ ను సప్లై చేశాడు. గుజ్ మన్ కు ఒకే ఒక  ప్రత్యర్థి ఉజియల్ కార్డినెస్. గల్ఫ్ కార్టెల్ అధిపతి కార్డినెస్ ను… 2003లో అరెస్టు చేయడంతో గుజ్ మన్ రూట్ క్లియర్ అయింది. గాడ్ ఫాదర్ ఆఫ్ డ్రగ్ వాల్డ్ గా ఎదిగాడు గుజ్ మన్. సినిమాటికగా డ్రగ్స్ సప్లై చేసేవాడు గుజ్ మన్. బోర్డర్ లో సెక్యూరిటీ ఉన్నా..డ్రగ్స్ మాత్రం ఈజీగా కంచే దాటేది. సొరంగాల నుంచి మాదకద్రవ్యాల సరఫరా చేసేవాడు. టన్నెల్స్ లో ఏకంగా చిన్న చిన్న రైల్వే లైన్స్ వేసి…బోర్డర్ దాటించాడు గుజ్ మాన్.

ఇటు మెక్సికో..అటు అమెరికా…ఎల్ చాపో కోసం జల్లెడ పట్టినా…చిక్కినట్టే చిక్కి జారుకునేవాడు. టైమ్ కలిసిరాకపోతే ఎవడైన బొక్కలే పడాల్సిందేనన్న కాన్సెప్ట్ గుజ్ మనకు కూడా వర్కవుట్ అయింది. 1993లో గ్వాటిమాలాలో తొలిసారిగా పోలీసులకు చిక్కాడు ఎల్ చాపో. నేరగాళ్ల అప్పగింత ఒప్పందంపై ఎల్ చాపోను…మెక్సికోకు ట్రాన్స్ ఫర్ చేశారు. తీవ్రమైన నేరారోపణలతో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఎల్ చాపో జైల్లోనే ఉన్నా..దాందా మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. రిమోట్ తో బిజినెస్ నడిపించాడు ఎల్ చాపో. సేమ్ టైమ్ జైల్ నుంచి జంపింగ్ స్కెచ్ వేశాడు. 2001లో లాండ్రీ బండిలో జైలో నుంచి ఎస్కేప్ అయ్యాడు గుజ్ మన్.

జైల్ నుంచి పారిపోయిన గుజ్ మన్.. ప్లాస్టిక్ సర్జరీలతో పోలీసుకు చిక్కకుండా దందా నడిపించాడు. 2014 ఫిబ్రవరి 22న సినలోవాలోని మజట్లాన్ రిసార్టులో మరోసారి పట్టుబడ్డాడు గుజ్ మన్. మెక్సికోలోని హెవీ సెక్యూరిటీ ఉండే ఆల్టిప్లానో జైల్లో పెట్టేశారు. అంతా బాగానే ఉందనుకున్నారు పోలీసులు. ఎప్పుడు చూసినా..కళ్ల ముందే కనిపించేవాడు. కళ్లకు కనిపించేది నిజం కాదని ప్రూఫ్ చేశాడు గుజ్ మన్. మంచిగా ఉన్నట్టుగానే నటిస్తూ..చేసేది చేసి ఎంచక్కా ఎస్కెప్ అయ్యాడు ఎల్ చాపో. గతేడాది జులై 11న జైలుకు కన్నం వేసి..సాఫీగా మస్కా కొట్టి పరారయ్యాడు లార్డ్ ఆఫ్ టన్నెల్.

ఎల్ చాపో ఎస్కేప్ స్కెచ్.. సినిమాను మరిపిస్తుంది. జైలు నుంచి పారిపోవాలనుకున్న ఈ ఖల్ నాయక్ ..పెద్ద సొరంగానికి ప్లాన్ వేశాడు. బాస్ ఆర్డర్స్ తో గ్యాంగ్ మెంబర్స్ ఎంట్రీ ఇచ్చారు. పంటపొలాల మధ్య ఉన్న జైలుకు ..కిలోమీటరున్నర దూరంలో ఓ ఇంటిని నిర్మించారు. ఆ ఇంటిలోపలి నుంచి జైలుకు సొరంగం తవ్వారు. టన్నెల్ నిర్మాణం కోసం..హైటెక్నాలజీ వాడారు. మట్టిని తవ్వి, రవాణా చేసేందుకు పట్టాలపై వేళ్లేలా ఓ మోటారు బైకును డిజైన్ చేశారు. దానికి ట్రాలీని తగిలించి మట్టిని తీశారు. టన్నులకొద్దీ మట్టిని ఎవరికీ అనుమానం రాకుండా తరలించారు. ఏకంగా 18 మీటర్ల లోతులో.. ఐదున్నర ఫీట్ల ఎత్తు, రెండున్నర ఫీట్ల వెడల్పుతో.. కిలోమీటరున్నర సొరంగాన్ని తొలిచేశారు. నేరుగా జైలులోని గుజ్ మాన్ గది బాత్ రూంలోని షవర్ వరకూ తవ్వారు  ఇంకేం టైమ్ చూసుకొని సొరంగంలోకి దిగిన గుజ్ మన్..మోటారు బైకు ఎక్కి తుర్రుమన్నాడు.

గుజ్ మన్ ఎస్కేప్ డ్రామాలో..జైలు సిబ్బంది కూడా పాత్రదారులే. దాదాపు 320కోట్ల లంచాలతో వల వేసినట్టు టాక్. జైలు సిబ్బందితో మిలాఖత్ కాకుంటే..టన్నెల్ సాధ్యం కాదని తేల్చేశారు ఎక్స్ పర్ట్స్. ఎప్పుడు చట్టానికి ఒక్క అడుగు ముందుంటే గుజ్ మన్..చివరికి చట్టానికి చిక్కక తప్పలేదు. మెక్సికన్ మెరైన్ కమాండోలు…గుజ్ మన్ ను అరెస్టు చేశారు. సినాలోవాలోని ఓ కారులో ఉండగా…ఎల్ చాపోను చుట్టేశారు మెక్సికన్ కమాండోస్.

సొంత వాళ్లకు రాబిన్ హుడ్… శత్రువులకు మోస్ట్ డేంజరస్

డ్రగ్స్ దందాతో ఫోర్బ్స్ లిస్టులో కూడా కర్చీఫ్ వేశాడు ఎల్ చాపో. 2009 నుంచి వరసుగా మూడేళ్లు..ఫోర్బ్స్ లిస్టులో పాగా వేశాడు. దాదాపు 20వేల కోట్ల ఆస్తి ఉన్నట్టు లెక్కలున్నాయి. మనోడి దారికి ఎవరైన అడ్డొస్తో…వాడి శాల్తీ లేవాల్సిందే. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి..వేల మందిని చంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అమెరికా ఎల్ చాపోను పట్టుకుంటే…31కోట్లు ప్రైజ్ మనీ ప్రకటించిందంటే సీన్ ఎంటో అర్థమయ్యే ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వ మొదటి శత్రువుగా కూడా ప్రకటించింది. గుజ్ మన్ యాక్షన్ కు రియాక్షన్ కూడా పేలిపోయేది. అతని ప్రత్యర్థులు గుజ్ మన్ సొదరుడిని జైల్లోనే మట్టుపెట్టారు. కొడుకుని కూడా కాల్చేశారు. సొంతవాళ్లకు రాబిన్ హుడ్. దేశాలకు మోస్ట్ డేంజరస్ పర్సన్. ఇప్పుడైతే.. గుజ్ మన్ జైల్లోనే ఉన్నాడు. రేపు ఏంటనేది పొట్టివాడి స్కెచ్ లే డిసైడ్ చేస్తాయి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy