గాలి బెయిల్ స్కామ్ రిటైర్డ్ జడ్జి ప్రభాకర్ రావు మృతి

JUDGE PHOTOగాలి జనార్దన్  రెడ్డి బెయిల్ స్కామ్ కేసులో నిందితుడు, రిటైర్డ్ డిస్ట్రిక్ జడ్జి ప్రభాకరరావు చనిపోయారు. 17వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో చనిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లిలో నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. కుమార్తె అమెరికాలో ఉంటుండగా.. కుమారుడు మాత్రం సిటీలోనే మరో ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ప్రభాకరరావు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సహజ మరణమా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనేది స్పష్టంగా తెలియటం లేదు. బెయిల్ స్కామ్ లో బెయిల్ వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు రావటం లేదు. ఎవరితోనూ కలవటానికి ఇష్టపడటం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంట్లో అపస్మారక స్థితిలోని ప్రభాకరరావును కొడుకు గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అక్కడ కన్నుమూసిన ఆయనకు.. పోస్ట్ మార్టం నిర్వహించారు వైద్యులు. సహజ మరణమా.. ఆత్మహత్య చేసుకున్నారా అనేది తేలాల్సి ఉంది.

prabhakar rao

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy