గాలె టెస్ట్: భారీ ఆధిక్యంలో భారత్

indiaగాలే వేదికగా శ్రీలంక, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 46.3 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ముకుంద్‌ 116 బంతుల్లో 81 పరుగులు చేసి గుణతిలక బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. భారత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ధావన్‌ 14 పరుగులు, పుజారా 15 పరుగులు చేసి ఔట్‌ కాగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 76 పరుగులతో క్రీజ్ ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ 498 పరుగుల ఆధిక్యంలో భారత్‌ ఉంది.

శ్రీలంక బౌలర్లు గుణతిలక,పెరేరా, లహీరు కుమారా తలా ఒక వికెట్ తీసుకున్నారు.

మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయిస్తున్న టీమిండియా మూడో రోజు కూడా పై చేయి సాధించింది. 154/5తో శుక్రవారం (జులై 28) ఆట ప్రారంభించిన లంక జట్టు.. తొలి ఇన్నింగ్స్‌‌లో 291 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఏంజెలో మాథ్యూస్ (83), పెరీరా (92 నాటౌట్) ఆదుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేసిన భారత్‌కు 309 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించే అవకాశం లభించినా.. కెప్టెన్ కోహ్లి రిస్క్ తీసుకోకుండా మళ్లీ బ్యాటింగ్‌ చేసేందుకే మొగ్గు చూపాడు.

భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాక వర్షం కారణంగా మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. తక్కువ స్కోరుకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను మరో ఓపెనర్ అభినవ్ ముకుంద్, కెప్టెన్ కోహ్లి ఆదుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ముకుంద్ 2011 తర్వాత తొలి హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. కోహ్లి టెస్టుల్లో 15వ అర్ధ శతకం సాధించాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy