గాలె టెస్ట్: రెండో రోజు శ్రీలంక స్కోరు-154/5

angelo-mathewsగాలె వేదికగా శ్రీలంక, భారత్‌ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో రెండోరోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక 44 ఓవర్లకు 5వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.

మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరగుతున్న తొలిటెస్టు గాలేలో భారత్ పట్టు బిగిస్తోంది. తొలుత బ్యాట్స్ మెన్ రాణించడంతో 133.1 ఓవర్లలో 600 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. ఆపై భారత బౌలర్లు రాణించడంతో తొలి టెస్టులో లంకపై ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో లంక టాపార్డర్ కుప్పకూలింది. ఓ దశలో 68 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన లంక, ఓపెనర్ ఉపల్ తరంగ హాఫ్ సెంచరీ ( 64) తో ఆదుకోవడంతో కాస్త కోలుకుంది. అయితే లేని పరుగుకోసం ప్రయత్నించిన తరంగ జట్టు స్కోరు 125 పరుగుల దగ్గర ఔటయ్యాడు.దీంతో లంక కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఏంజెలో మాథ్యూస్ ఆచితూచి ఆడుతూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ జాగ్రత్తగా ఆడాడు. రెండో రోజు ఆట నిలిపివేసే సమయానికి లంక 44 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. మాథ్యూస్ 54,పెరారా 6 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో వికెట్ తీశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy