గాలె టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ

matchఐదు రోజుల మ్యాచ్ ను నాలుగు రోజే ముగించారు. బ్యాటింగ్, బౌలింగ్ లో టీమిండియా వీరవిహారంతో శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఒకటి – సున్నాతో లీడ్ లో ఉంది. గాలె వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా. నాలుగో రోజు ఆట ప్రారంభించిన మనోళ్లు.. కెప్టెన్ కోహ్లీ సెంచరీ తర్వాత.. 550 పరుగుల విజయలక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచి డిక్లేర్ చేశారు.

సెకండ్ ఇన్నింగ్స్.. విక్టరీ ఛేజ్ కోసం బరిలోకి దిగిన శ్రీలంక జట్టును భారత బౌలర్లు ఆడుకున్నారు. ఏ దశలోనూ పరుగులకు అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ కరుణరత్నే 97 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వికెట్ కీపర్ నిరోశన్ దిక్ వెల్లా 67 పరుగులు చేశాడు. వీళ్లద్దరే రాణించారు. ప్రదీప్, కుమార ఇద్దరూ డకౌట్ అయ్యారు. రంగణ హెరాత్, అశీల గుణరత్నే బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డారు. కుషాల్ మెండీస్ 36 రన్స్ చేశాడు. దీంతో శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్ లో 245 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియాకు 304 పరుగుల విజయాన్ని అందించింది.

భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంక నడ్డివిరిచారు. షమి, యాదవ్ చేరో వికెట్ తీశారు. శ్రీలంక బ్యాట్స్ మెన్ కొద్దిసేపు జోరుగా ఆడినా.. వికెట్లు కాపాడుకోలేకపోయింది. వెంట వెంటనే పడుతున్న వికెట్లతో 245 పరుగులకే మ్యాచ్ ను చుట్టేసింది.

స్కోర్ బోర్డు: 

ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్:

శిఖర్ ధావన్ 190, అభినవ్ ముకుంద్ 12, ఛటేశ్వర్ పుజారా 153, విరాట్ కోహ్లీ 3, అజింక్యా రహానే  57, రవిచంద్రన్ అశ్విన్ 47, వృద్ధిమాన్ సాహా 16, హార్దిక్ పాండ్యా 50, రవీంద్ర జడేజా 15, మహ్మద్ షమీ 30

బౌలింగ్: ప్రదీప్ 6 వికెట్లు, కుమార 3 వికెట్లు, రంగనా హెరాత్ ఒక వికెట్

శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్:

కరుణరత్నే 2, ఉపుల్ తరంగా 64, దనుష్క గుణతిలక 16, కుసల్ మెండీస్ 0, మ్యాథ్యూస్  83, నిరోషన్ డిక్ వెల్ల 8, దిల్రువాన్ పెరెరా 92 నాటౌట్, రంగనా హెరత్ 9, నువాన్ ప్రదీప్ 10, లహిరు కుమారా 2, అసెలా గుణరత్నే  0 రిటైర్డ్ హట్

బౌలింగ్: షమీ 2, ఉమేశ్ యాదవ్ 1, రవిచంద్రన్ అశ్విన్ 1, రవీంద్ర జడేజా 3, హార్దిక్ పాండ్యా 1

ఇండియా సెంకడ్ ఇన్నింగ్స్ :

శిఖర్ ధావన్ 14, అభినవ్ ముకుంద్ 81, ఛటేశ్వర్ పుజారా 15, విరాట్ కోహ్లీ 103 నాటౌట్, అజింక్యా రహానే 23 నాటౌట్

బౌలింగ్(సెకండ్): పెరెరా 1, కుమార 1, గుణతిలక 1

శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్:

కరుణరత్నే 97, ఉపుల్ తరంగా 10, గుణతిలక 2, కుషల్ మెండీస్ 36, మ్యాథ్యూస్ 2, నిరోషన్ డిక్ వెల్లా 67, పెరెరా 21 నాటౌట్, నువాన్ ప్రదీప్ 0, లహిరు కుమారా 0, రంగానా హెరాత్ 0, అసెలా గుణరత్నే 0

బౌలింగ్(సెకండ్): షమీ 1, ఉమేశ్ 1, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 3

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy