గిన్నీస్ రికార్డే లక్ష్యం: నీటిపై తేలాడుతూ ఆశ్చర్యపరుస్తున్న వరంగల్ వాసి

water
గంట, రెండు గంటలు కాదూ 24 గంటల పాటు నీటిలో తేలాడుతారు వరంగల్ జిల్లాకు చెందిన ఐలయ్య. ఆరు రకాల యోగాసనాలు చేస్తూ అందరిని అబ్బుర పరుస్తున్నారు. ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులకెక్కారు. గిన్నీస్ రికార్డ్ సాధించడమే లక్ష్యమంటున్న ఐలయ్య స్వస్ధలం వరంగల్ రూరల్ జిల్లా ముగ్ధుపురం. వెల్డింగ్ చేసుకుంటూ జీవనం సాగించే ఐలయ్య.. ఖాళీగా ఉండే సమయంలో పుస్తకాలు చదువుతుండేవారు. 70 ఏళ్ల వృద్దుడు నీటిలో ఆసనాలు చేసి… అవార్డులు సాధించిన వార్త చదవి.. తాను కూడా నీటిలో ఆసనాలు వేయాని నిర్ణయించుకున్నారు. చెరువుల్లో, వ్యవసాయబావుల్లో గంటల కొద్ది ప్రాక్టీస్ చేశారు. చివరికి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఐలయ్య గంటలకొద్ది నీటిపై తేలాడుతూ ఆసనాలు వేస్తున్నారు.
శవాసనం, వజ్రాసనం, పద్మాసనం, సూర్య నమస్కారాలు, ప్రసన్నాసనం ఇలా చాలా ఆసనాలు నీటిపై వేస్తున్నారు ఐలయ్య. 24 గంటల పాటు నీటిలో యోగాసనాలు వేసి 1999లో లిమ్కా బుక్ రికార్డు అందుకున్నారు. 2005లో వ్యవసాయ బావిలో 30 గంటల పాటు యోగాసనాలు వేసి రాష్ట్ర, జిల్లా అధికారులతో అవార్డులు అందుకున్నారు. శవాసనం చేస్తుండగా శరీరం మీద నుంచి పాములు పోయినా.. అలానే ఉండేవారని ఐలయ్య స్నేహితులంటున్నారు. సాధారణంగా చాలామంది నీటిలో దిగాలంటే భయపడతారు. కానీ ఐలయ్య గంటలకొద్దీ నీటిపై తేలాడటం, ఆసనాలు వేయడం ఆశ్చర్య పరుస్తోందంటున్నారు స్నేహితులు. ఇప్పటికే లిమ్కా బుక్ రికార్డులకెక్కిన ఐలయ్య… గిన్నీస్ బుక్ రికార్డుల్లో పేరు సాధించటమే లక్ష్యమంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy