గిల్టు నగల తయారీలో మహిళలకు శిక్షణ

rold gold2మహిళలకు ఆర్థికంగా చేయుతనిచ్చేందుకు ఇప్పటికే రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్న కేంద్రం…. ఇప్పుడు గిల్టు నగల తయారీపై శిక్షణకు రెడీ అయింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర గ్రామంలో స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా… గిల్టు నగల తయారీలో శిక్షణ ఇస్తున్నారు అధికారులు. రోల్డ్ గోల్డ్ నగలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో… మహిళలు కూడా శిక్షణ పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు.

బంగారం కొనే స్తోమతలేని వారు, మధ్యతరగతి మహిళలు గిల్టు నగలు కొనుక్కొని తమ సరదాలు తీర్చుకుంటున్నారు. ఉన్నత వర్గాలకు చెందిన మహిళలు కూడా ప్రత్యేక డిజైన్లలో దొరికే వన్ గ్రామ్ గోల్డ్, రోల్డ్ గోల్డ్ నగలు ధరించటంపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఉమ్మడి కరీంనగర్  జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, లయన్స్ క్లబ్ సహకారంతో మొదటగా గంగాధరలోనే ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమ్యాల మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన మహిళలు, యువతులు ఉచిత శిక్షణకు హాజరవుతున్నారు.

వివిధ రకాల హారాలు, నెక్లెస్ లు,  చెవి కమ్మలు, రింగులు, ఉంగరాలు, జడ పిన్నులు, చీర పిన్నులు ఇలా వెరైటీ డిజైన్ల తయారీపై ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తున్నారు. శిక్షణలో నైపుణ్యం సాధించిన మహిళలకు.. ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. మార్కెటింగ్ స్కిల్స్, వేదికలపై మాట్లాడేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీంతో తమ కాళ్లపై తాము నిలబడగలమనే నమ్మకం కలుగుతోందంటున్నారు మహిళలు.

ఇక్కడ తయారయ్యే నగలకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉందని చెబుతున్నారు నిర్వాహకులు. శిక్షణ తర్వాత మహిళలు స్వయంగా తయారీ యూనిట్లు పెట్టుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలు, నగలు తయారీకి అవసరమైన ముడి సామగ్రిని అందిస్తున్నామన్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా ఇస్తున్న శిక్షణ ఇస్తున్నామని చెబుతున్నారు.

మహిళలు రూపొందించిన నగలను మార్కెటింగ్ చేసి.. వచ్చిన ఆదాయాన్ని అందరికీ పంచేలా చూస్తామంటున్నారు నిర్వాహకులు. ఇలాంటి శిక్షణ తొలిసారిగా గంగాధరలో ఏర్పాటు చేసినందుకు సంతోషం వ్యక్తంచేస్తున్నారు మహిళలు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy