గీత గోవిందం పోస్టర్ రిలీజ్

geetj-dgsgsఅర్జున్ రెడ్డి సినిమా త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో మంచి జోరుమీదున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం గీతా ఆర్ట్స్ బేన‌ర్‌లో గీత గోవిందం అనే సినిమా చేస్తున్నాడు. ప‌ర‌శురామ్ డైరెక్షన్ లో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న‌ ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రీసెంట్‌ గా ఈ మూవీకి సంబంధించిన పోస్ట‌ర్ ఒక‌టి విడుద‌ల కాగా, ఇది అభిమానుల‌లో ఆస‌క్తి క‌లిగించింది . పోస్ట‌ర్‌ని చూసి అర్జున్ రెడ్డి త‌ర‌హాలో ఈ సినిమాలోను డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయా అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఒక్కో పాట విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ద‌మ‌య్యారు మేక‌ర్స్ . ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే అంటూ సాగే ఈ పాటను మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసి ప్ర‌క‌ట‌న చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy