గుంటూరు వరకు శాతవాహన ఎక్స్ ప్రెస్

రైల్వే ప్రయాణికుల సంఖ్య పెరిగిపోవడంతో వారికి అనుగుణంగా సౌకర్యాలను కల్పించడానికి చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. సికింద్రాబాద్-విజయవాడకు రోజు జర్నీ చేసే వారి సంఖ్య ఎక్కువ కావడంతో… ఇప్పటి వరకు విజయవాడ- సికింద్రాబాద్- విజయవాడ మధ్య నడుస్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ ను గుంటూరు వరకు పొడగించేందుకు రైల్వే బోర్టు గ్రీన్ సిగ్నలిచ్చింది. ఈ రైల్( నెం.12713) గుంటూరులో ఉదయం 5.15 గంటలకు బయల్దేరి..విజయవాడ మీదుగా సికింద్రాబాద్ కు 11.55 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు( నెం.12714) సికింద్రాబాద్ లో సాయంత్రం 4.15 కి బయల్దేరి విజయవాడ మీదుగా రాత్రి 11.15 గంటలకు చేరుతుందని తెలిపారు అధికారులు. నవంబర్ 1వ తేదీ నుంచి అమలయ్యే కొత్త టైం టేబుల్ లో ఈ రైలు గురించి పూర్తి వివరాలను తెలపనున్నారు. ఇప్పటికే గుంటూరు నుంచి పల్నాడు ఎక్స్ ప్రెస్ ప్రతి రోజు ఉదయం 5.45 గంటలకు బయల్దేరి నడికుడి మీదుగా వికారాబాద్ కు వెళ్తుంది. అదేవిధంగా ఉదయం 6 గంటలకు గోల్కొండ ఎక్స్ ప్రెస్ విజయవాడ మీదుగా సికింద్రాబాద్ కు వెళ్తుంది. అదే సమయానికి దగ్గరగా శాతవాహన ఎక్స్ ప్రెస్ ప్రారంభించనున్నారు రైల్వే అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy