గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

vinaykumarbjpmlaకర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యే బీఎన్ వినయ్‌కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు. జయనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వినయ్‌కుమార్ మళ్లీ అక్కడి నుండే పోటీ చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తూ కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, పార్టీ కార్యకర్తలు  వినయ్‌కుమార్‌ను జయదేవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనను ప్రాణాలతో కాపాడేందుకు ఎంతో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం తెల్లవారుజామున వినయ్‌కుమార్ కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. జయనగర్ నుంచి రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మృతితో ఆ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా పడనుంది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy