గుండెలు పగిలే న్యూస్ : ఆన్ లైన్ డిస్కౌంట్స్ ఎండ్!

online-shopingవినటానికి చాలా బాధగా ఉన్నా ఇది పచ్చి వాస్తవం. జూలై ఒకటో తేదీ నుంచి ఆన్ లైన్ షాపింగ్ పై డిస్కౌంట్స్ ను ఊహించటం కష్టమే. దీనికంతటికీ కారణం GST. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆన్ లైన్ టైకూన్స్ అయిన అమేజాన్, ఫ్లిప్ కర్ట్ లు భారీ ఆఫర్స్ ఇస్తూ ఉన్న సరుకు మొత్తాన్ని బయటకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. 25 నుంచి 90శాతం డిస్కౌంట్స్ ప్రకటిస్తూ.. జూన్ 30వ తేదీలోపు క్లియరెన్స్ పెట్టుకున్నాయి.

జూలై ఒకటో తేదీ నుంచి ఆన్ లైన్ షాపింగ్ పై డిస్కౌంట్స్ ఉండవని తేల్చేస్తున్నారు ఆర్థిక నిపుణులు. GST వల్ల ఆన్ లైన్ షాపింగ్ భారం కాబోతున్నది. దేశం మొత్తం ఒకే పన్ను-ఒకే మార్కెట్ వస్తుంది. ఈక్రమంలో ఒక వస్తువుపై ఒకసారి పన్ను విధిస్తారు. అది నేరుగా కస్టమర్ కు వెళుతుంది. అంటే ఎక్కడైతే బిల్లు తయారవుతుందో అక్కడే ట్యాక్స్ చెల్లించేస్తాం. ఒక్కసారి బిల్లు తయారు అయినప్పుడు దానిపై డిస్కౌంట్ ఇవ్వటం సాధ్యం కాదు. ఇప్పటి వరకు కంపెనీలు – ఆన్ లైన్ పోర్టల్స్ మధ్య అవగాహనతో షాపింగ్ వెబ్ సైట్స్ బిల్లు రైజ్ చేసేవి. దీంతో కంపెనీ ధర – ఆన్ లైన్ మధ్య ఒప్పందంలో భాగంగా ఇష్టానుసారం ధర నిర్ణయించి.. భారీ డిస్కౌంట్స్ ఇచ్చేవి. ఇప్పుడు కంపెనీ దగ్గరే బిల్లుతోపాటు పన్ను చెల్లిస్తుండటంతో డిస్కౌంట్ కు ఆస్కారం ఉండదంటున్నారు నిపుణులు. కేవలం ఒక శాతం మార్జిన్ తో ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్స్ వస్తువులను డెలివరీ చేస్తాయి.

అంతేకాదు ఇక నుంచి అత్యంత వేగంగా సర్వీస్ ఉంటుంది. దేశం మొత్తం ఒకే పన్ను కాబట్టి.. రాష్ట్రాలకో బిల్లు తయారు చేయాల్సిన అవసరం లేదు. మీరు హైదరాబాద్ లో ఉండి.. ఢిల్లీలో ఆర్డర్ బుక్ చేసినా 24 గంటల్లోనే మీ ఇంట్లో వస్తువు ఉంటుంది. ఎందుకంటే లోకల్ మార్కెట్ కు అనుగుణంగా బిల్లు తయారీ, ట్యాక్స్ ఛార్జీల మోత ఉండదు కదా. ఆర్డర్ బుక్ చేసిన ఒక చోట బిల్లు రెడీ అయ్యిందంటే అది ఫిక్స్. దీంతో ఆయా కంపెనీల ఒప్పందం ప్రకారం మీ వస్తువు లోకల్ మార్కెట్ నుంచి నేరుగా.. చాలా త్వరగా మీ ఇంట్లోకి వచ్చేస్తోంది.

సో.. కస్టమర్లు ఇక నుంచి ఆన్ లైన్ డిస్కౌంట్స్ పై ఆశలు వదులుకోండి. అమేజాన్, ఫ్లిప్ కార్డ్, ఈబే లాంటివి ఇక నుంచి కేవలం డెలివరీకే పరిమితం కానున్నాయి ప్రస్తుత విధానాల ప్రకారం. చూడాలి డిస్కౌంట్స్ కోసం మరో మార్గాన్ని అన్వేషిస్తాయేమో..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy