గుంపులుగా ఎగబడ్డాయి… కోతుల దాడిలో వ్యక్తి మృతి

యూపీ : కోతుల దాడిలో ఓ వ్యక్తి చనిపోయిన ఘటన యూపీలో జరిగింది. ఓ వృద్ధున్ని కోతులు రాళ్లతో కొట్టి చంపాయి. యూపీలోని భాగ్‌ పట్ సమీపంలోని టిక్రీ గ్రామంలో యజ్ఞం కోసం పుల్లలు తేవడానికి అడవిలోనికి వెళ్లిన వృద్ధునిపై కోతులు గుంపులుగా ఎగబడి దాడి చేశాయి. గమనించిన గ్రామస్థులు గాయపడిన వృద్ధుడిని హస్పిటల్ లో తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించాడు. దీంతో సీరియస్ అయిన గ్రామస్థులు, మృతుడి కుటుంబసభ్యులు కోతులపై FIR నమోదు చేయాలని పోలీసులపై వత్తిడి తెస్తున్నారు. కోతులను అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టి 302 కింద మర్డర్‌ కేసు పెట్టాలని నిరసన వ్యక్తం చేశారు.

విచారణ జరిపించి యావజ్జీవ, మరణశిక్ష వేయించాలన్నారు. ఇది అయ్యేపని కాదని పోలీసులు భావిస్తున్నారట. అందుకే వారు వేరే కథనం వినిపిస్తున్నారని చెబుతున్నారు. అంతా ప్రమాదవశాత్తు జరిగిందని అంటున్నారు. వృద్ధుడు అలసిపోయి రాళ్లకుప్ప దగ్గర నడుంవాల్చాడని.. కోతులు వచ్చి ఆ కుప్పపై గంతులు వేశాయని దూరం నుంచి చూసినవారు చెబుతున్నారు. రాళ్లు ఆయన మీద పడిపోయాయని.. పాపం గాయాలతో మరణించి ఉంటాడని మరికొందరు చెబుతున్నారు. వీరి మాటలను ఆసరాగా తీసుకున్న పోలీసులు ఇలాంటి కహానీలు చెబుతున్నారట. కుటుంబసభ్యులు మాత్రం కోతులపై కేసు పెట్టాల్సిందేనంటున్నారు.

కోతులు విచ్చల విడిగా తిరుగుతూ నానా రచ్చ చేస్తున్నాయని..వేసిన పంటలను నాశనం చేయడమే కాకుండా మనుషులకు ప్రాణ భయం ఉందంటున్నారు. వీటి వల్ల ఓ మనిషి ప్రాణం పోయినా ప్రభుత్వం చలించకపోవడం దారుణమంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం పట్టించుకుని గ్రామాల్లో కోతుల బెడదలేకుండా చేయాలని కోరుకుంటున్నారు స్ధానిక ప్రజలు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy