గుజరాత్‌లో 12 సింహాలు మృతి  

గుజరాత్‌లోని గిర్‌ అడవుల్లో గత పది రోజుల్లో 12 సింహాలు మృతి చెందడం సంచలనంగా మారింది. అంతరించిపోతున్న సింహాల్ని కాపాడటానికి చర్యలు చేపడుతున్నామని చెబుతున్న అటవీశాఖ అధికారులు వాటి సంరక్షణకు మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఈ సంఘటన రుజువు చేస్తోంది. అమ్రేలి జిల్లా పరిధిలోని గిర్‌ తూర్పు డివిజన్‌లోనే 12 సింహాలు మృతిచెందినట్లు గుర్తించారు అటవీ అధికారులు. వాటి నమునాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జునాగఢ్‌ వెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, కాలేయ సంబంధ సమస్యలతో పులులు మరణిస్తున్నాయన్నారు పశుసంవర్థకశాఖ అధికారులు. సింహాల వరుస మరణాలతో ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామన్నారు గుజరాత్ రాష్ట్ర అటవీశాఖ మంత్రి గణపత్ వాసవ. అనారోగ్యం కారణాలతోనే సింహాలు మరణించాయని పోస్టుమార్టం నివేదికలో తేలిందన్నారు మంత్రి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy