గుజరాత్ టెన్షన్: రాజ్యసభ కోసం అమీతుమీ

gujarat-poll-rsగుజరాత్ రాజకీయాలు..  వేడివేడిగా ఉన్నాయి. ఇవాళ జరగనున్న రాజ్యసభ ఎన్నికలను.. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లు.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉన్న 44 మంది ఎమ్మెల్యేలు జారిపోకుంట ఉండేందుకు.. కాంగ్రెస్ నేతలు క్యాంప్ పాలిటిక్స్ చేస్తున్నారు. మరోవైపు.. 3 స్థానాలు గెలిచేందుకు బీజేపీ లీడర్లు ట్రై చేస్తున్నారు.

గుజరాత్ లో జరగుతున్న రాజ్యసభ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. బీజేపీ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ.. మూడో స్థానం కోసం బల్వంత్ సింగ్ రాజ్ పుత్ ను.. బీజేపీ బరిలో దించింది. వీళ్ల గెలుపు కోసం… పార్టీ ఎమ్మెల్యేలతోని మంతనాలు చేస్తున్నారు ముఖ్య నేతలు. మరోవైపు.. అంతర్గత కలహాలతో ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ నుంచి.. పార్టీ అధినేత్రి సోనియా రాజకీయ కార్యదర్శిగా ఉన్న అహ్మద్ పటేల్.. ఇక్కడి నుంచే పోటీ చేస్తుండడంతో.. ఎన్నికల వేడి మరింత పెరిగింది.

గుజరాత్ అసెంబ్లీలో.. బీజేపీకి 121 మంది సభ్యులు ఉన్నారు. ఈ బలంతో.. అమిత్ షా, స్మృతీ ఇరానీ విజయం లాంఛనమే. మిగిలిన బల్వంత్ సింగ్ రాజ్ పుత్ కు.. 31 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాని.. 45 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తేనే.. రాజ్యసభ ఎన్నికలలో.. గెలిచే అవకాశాలున్నాయి. దీంతో.. పక్క పార్టీల ఎమ్మెల్యేల మద్దతుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అలాగే.. కాంగ్రెస్ నుంచి నిలబడ్డ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ కు.. టెన్షన్ తగ్గడం లేదు. గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 57 మంది సభ్యులు ఉండేటోల్లు. కాని.. ఆరుగురు రాజీనామా చేయడం.. సీనియర్ నేత వాఘేలాతో  ఏడుగురు విడిపోవడంతో.. కాంగ్రెస్ బలం ఇప్పుడు 44కు పడిపోయింది. ఈ 44 మందిని కాపాడుకునేందుకు.. కాంగ్రెస్ నానా కష్టాలూ పడ్తోంది.

బెంగళూరులో చాలా రోజుల నుంచి క్యాంపులో ఉన్న 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..రెండు రోజుల కింద గుజరాత్ చేరుకున్నారు. వారితో.. పార్టీ హై కమాండ్ టచ్ లో ఉంటంది. ఎవరూ చేజారిపోకుండా చూసుకుంటోంది. ఈ 44 మంది అహ్మద్ పటేల్ కు ఓటు వేసినా…. గెలవాల్నంటె.. ఇంకో ఎమ్మెల్యే మద్దతు అవసరమవుతుంది. అందుకే.. ఎన్సీపీకి చెందిన ఇద్దరు.. జేడీయూకు చెందిన ఓ ఎమ్మెల్యే.. తనకు మద్దతు ఇస్తామన్నట్టు.. అహ్మద్ పటేల్ చెబుతున్నారు. కానీ.. తమను బీజేపీకి అండగా నిలవాలని పార్టీ ఆదేశించినట్టు.. ఎన్సీపీ నేతలు చెబుతుండడం.. కాంగ్రెస్ ను టెన్షన్ పెడ్తోంది.

పోటీ ఇంతగా ఉన్నా కూడా.. విజయం మీద.. ఎవరికి వాళ్లే నమ్మకంగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అహ్మదాబాద్ కు 77 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజానంద్ రిసార్టులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కల్సిన అహ్మద్ పటేల్.. తన పార్టీ శాసనసభ్యుల మీద నమ్మకముందన్నారు. ఎన్నికలల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ మాత్రం రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు తమదే అంటోంది. ప్రజలు వరదలతో చనిపోతుంటె.. ఎమ్మెల్యేలు రిసార్ట్ ల ఎంజాయ్ చేస్తున్నరని ఆరోపించారు గుజరాత్ సీఎం విజయ్ రుపాని. రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ మీద నమ్మకం లేదన్నారు. గుజరాత్ లో 3 స్థానాలతో పాటు.. పశ్చిమ బెంగాల్ లో 6.. మధ్యప్రదేశ్ లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy