గుజరాత్: రేపు 6 పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ 

gujarath-voteగుజరాత్‌లోని ఆరు పోలింగ్ సెంటర్లలో ఆదివారం(డిసెంబర్-17) రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. వాద్గామ్, వీరంగామ్, దస్కొరాయ్, సావ్లి ఏరియాల్లో ఈ పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు అధికారులు. గురువారం (డిసెంబర్-14)న రెండవ విడత పోలింగ్‌‌లో ఈ ఆరు పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. మాక్ పోల్ నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారులు ఈవీఎంల నుంచి మాక్‌పోల్ ఓట్లను తొలగించకపోవడంతో ఆయాచోట్ల రీపోలింగ్‌కు ఈసీ నిర్ణయించింది. ఈనెల 18న ఓట్ల లెక్కింపు ..అదే రోజు ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy