గుజరాత్ లో ‘పద్మావతి’ బ్యాన్

padmavathi bandhవిడుదలకు ముందే వివాదాస్పందంగా మారిన సినిమా పద్మావతి. ఈ సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని రాజ్ పూత్ లు ఇప్పటికే హెచ్చరించారు. దీంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు విడుదలను నిలిపేశాయి. పద్మావతిని మరో బీజేపీ పాలిత రాష్ట్రం నిషేధించింది. వచ్చే నెలలో ఎన్నికలకు వెళ్తున్న గుజరాత్ ఈ మూవీని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలయిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ పద్మావతిని నిషేధించాయి. బుధవారం(నవంబర్-22) సినిమాపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ స్పందించారు. రాజ్‌పుత్‌ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్న ఈ సినిమాను గుజరాత్‌లో విడుదల కానివ్వబోమని తెలిపారు. చరిత్రను నాశనం చేసే ఈ ప్రయత్నాన్ని మేం అడ్డుకుంటామని స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తాం కానీ ఇలా ఘనమైన చరిత్రను వక్రీకరిస్తే మాత్రం సహించబోయేది లేదని స్పష్టం చేశారు సీఎం రూపానీ.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy