గుట్ట – వరంగల్ నేషనల్ హైవేకు గ్రీన్ సిగ్నల్

NH 163గుట్ట – వరంగల్ ఫోర్ లేన్ రోడ్

రహదారి విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం

యాదగిరిగుట్ట-వరంగల్ నేషనల్ హైవే విస్తరణకు మోక్షం లభించింది. ఆ మార్గాన్ని 4 లేన్ రోడ్డుగా విస్తరించేందుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 163వ నంబరు జాతీయ రహదారిలో భాగంగా యాదగిరిగుట్ట-వరంగల్ మధ్య ఉన్న దాదాపు 99 కిమీల పొడవైన రహదారిని రూ. 1,905.23 కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ విధానంలో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy