గుడ్లు తేలేస్తున్నారు : ఎగ్ @ రూ.6

eegsగుడ్ల రేట్లు ఒక్కసారిగా రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. కొద్ది రోజుల క్రితం ఆకాశన్నంటిన కూరగాయాల ధరలు నెమ్మదిగా  దిగివస్తున్నాయి. ఇదే టైంలో గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. ఎంతగా అంటే  చికెన్ తో పోటీ పడుతున్నాయి.

దేశ వ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు దాదాపు రూ.6 పలుకుతోంది. అయితే పుణె,ముంబై లో 100 గుడ్ల ధర రూ.530 ఉండగా.. విజయవాడ, విశాఖ నగరాల్లో రూ. 532 పలుకుతుండగా.. హైదరాబాద్‌లో రూ. 535 గా ఉంది.

ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ వంద గుడ్ల ధర రూ. 110కి పైగా పెరిగింది. హోల్‌సేల్‌గా గుడ్ల రేట్లు భారీగా పెరగడంతో.. రిటైల్‌గా కొన్ని చోట్ల రూ. 6 నుంచి రూ.6.5 వరకు అమ్ముతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వంద గుడ్ల ధర సగటున రూ. 333 పలకగా అది క్రమంగా పెరుగుతూ రూ. 532 దాటింది. ఈ స్థాయిలో గుడ్ల ధరలు పెరగడం గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు పౌల్ట్రీ యజమానులు.దేశంలో కోడి గుడ్ల డిమాండ్ 15 శాతం పెరగడంతోనే ధరలు పెరిగాయంటున్నారు.

కార్తీక మాసంలో తెలుగు ప్రజలు నాన్ వెజ్ తినరు. ఇప్పుడు కార్తీక మాసం ముగియడంతో గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy