జియో, చైనా మొబైల్ మేకర్ షియోమీ ఒక్కటయ్యాయి. ఎంపిక చేసిన షియోమీ ఫోన్లపై అదనంగా 30 జీబీ డేటాను అందిస్తున్నట్టు జియో ప్రకటించింది. అయితే జూన్ 16వ తేదీ తర్వాత జియో నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. రూ.309 లేదంటే అంతకంటే ఎక్కువ రీచార్జ్‌తో నెలకు 5జీబీ చొప్పున 4జీబీ డేటాను ఆరు రీచార్జ్‌ల వరకు పొందవచ్చని వివరించింది. మార్చి 31, 2018 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. మొత్తం 30జీబీ డేటాను పొందే అవకాశం ఈ ఆఫర్ ద్వారా లభిస్తుంది. రీచార్జ్ చేసుకున్న 48 గంటల్లో అదనపు డేటా అకౌంట్లోకి వస్తుందని తెలిపింది.
షియోమీ విడుదల చేసిన రెడ్మీ2, రెడ్మీ2 ప్రైమ్, రెడ్మీ నోట్3, రెడ్మీ నోట్ 4జీ, రెడ్మీ నోట్ 4జీ ప్రైమ్, ఎంఐ 4ఐ, ఎంఐ 5, ఎంఐ మ్యాక్స్, ఎంఐ మ్యాక్స్ ప్రైమ్, రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్లస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్, రెడ్మీ నోట్4, రెడ్మీ 4ఏ, రెడ్మీ 4 తదితర ఫోన్లు ఉపయోగిస్తున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.